RC Trend Setters Success Story : స్కూల్‌లో చెప్పే పాఠాల కంటే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలే భవిష్యత్‌ను నిర్దేశిస్తాయనడానికి ఈ యువకుడి జీవితమే నిదర్శనం. వ్యాపారం కోసం ఈ యువకుడి తండ్రి తెచ్చిన అప్పులు కుప్పలుగా మారాయి. అప్పులిచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగి వేదనలు మిగిలాయి. తండ్రి కన్నీళ్లతో పాటు కష్టాన్ని పంచుకున్నా ఈ యువకుడు. అనతికాలంలోనే అప్పులు తీర్చి, సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాడు.
23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా
ఈ యువకుడు పేరు రమేష్. ఊరు విజయవాడ. చిన్నప్పటి నుంచి ఈ యువకుడికి కొత్త బట్టలంటే మహా ఇష్టం. పండుగలే కాదు, జేబులో డబ్బులుంటే సరి ఈ యువకుడి ఒంటి మీద కొత్త పాంటో, షర్టో మెరవాల్సిందే. అలా కొత్త బట్టలు వేసుకునే అలవాటును, తన బిజినెస్‌కు ఐడియాగా మార్చుకున్నాడు. 35 వేలతో వ్యాపారం మొదలు పెట్టి, లక్షల్లో లాభాల్ని ఆర్జిస్తున్నాడు. RC ట్రెండ్స్ పేరుతో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి యువతకు ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నాడు.
RC Trend Setters Clothing Brand : అనుకున్నంత సాఫీగా ఈ యువకుడి జీవితం ఏం సాగలేదు. తండ్రి వ్యాపారం కోసం తెచ్చిన అప్పులు, తలకు మించిన భారంగా మారాయి. దాంతో కుటుంబంమంతా అప్పులు తీర్చడం కోసం నానా తిప్పలు పడ్డామని ఈ యువకుడు చెబుతున్నాడు. ఒకసారి గుజరాత్(Gujarat) వెళ్లిన రమేశ్‌కి అక్కడ దుస్తులు తక్కువ ధరకే దొరుకుతుండటంతో వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో తల్లి ఇచ్చిన 35 వేలతో గుజరాత్ నుంచి బట్టలు తెచ్చి ఇంట్లో అమ్మడం మొదలు పెట్టానని చెబుతున్నాడు
కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో ఒక స్టోర్‌ని ప్రారంభించాడు రమేశ్. ఇదే క్రమంలో స్టాక్ కోసం డీలర్లకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులిచ్చి మోసపోయాడు. దాంతో నెల్లూరు జిల్లాకు చెందిన రుహాన్ ద్వారా వైబ్‌సైట్ రూపొందించి వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు రమేశ్. భారతీయ బ్రాండ్స్ అన్ని ఒకేచోట లభించేలా RC ట్రెండ్స్‌ని ప్రారంభించామని రమేశ్ అంటున్నాడు. స్టోర్స్‌తో పాటు వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా అమ్మకాలు చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నాడు
ప్రత్యేకించి మెన్స్‌వేర్ కోసమే RC ట్రెండ్స్‌ను ప్రారంభించామని వెబ్‌సైట్ రూపకర్త రూహాన్ అంటున్నాడు. డబ్బులు ఉన్నప్పుడు కొనుకున్న కొత్త చొక్కాలే, రమేష్ జీవితాన్ని మార్చేసింది. పాతికేళ్ల ప్రయాణంలో జీవితం నేర్పిన పాఠాలతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ యువ వ్యాపారవేత్తగా రాణిస్తోన్న రమేశ్, మధ్య తరగతి యువతకు సైతం బ్రాండ్ అండ్ ట్రెండీ వేర్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు.
"నాకు చిన్నతనం నుంచి కొత్తబట్టలపై ఉన్న మక్కువే ఈసంస్థను ప్రారంభించడానికి కారణమైంది. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని సరుకును విక్రయిస్తుంటాము. తక్కువ ధరలలో, మంచి నాణ్యత గల డ్రెస్‌లను విక్రయిస్తాము". - రమేశ్, ఆర్సీ ట్రెండ్స్ వ్యవస్థాపకులు
ఆమె నాట్యానికి నటరాజు మైమరిచాడు - వెండితెర ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికింది
షైనింగ్ స్టార్ త్రిష పూజిత - మహిళల ప్రీమియర్ లీగ్‌లో తెలుగుమ్మాయి హవా