ETV Bharat / state

పోలీస్ స్టేషన్​లోనే పోసానికి వైద్యపరీక్షలు - విచారణ చేస్తున్న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు - POLICE SHIFTED POSANI TO PS

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని కృష్ణమురళి విచారణ - రైల్వేకోడూరు కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరిచే అవకాశం

Police_Shifted_Posani
Police_Shifted_Posani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2025, 1:12 PM IST

Updated : Feb 27, 2025, 1:50 PM IST

Police Shifted Posani Krishna Murali to Obulavaripalle: వైఎస్సార్సీపీ హయాంలో నాలుకకు నరం లేదన్నట్లుగా చంద్రబాబు, పవన్‌, లోకేశ్​పై బండబూతులతో దాడి చేసిన సినీనటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని కృష్ణమురళి విచారిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు విచారణ చేస్తున్నారు. పోసాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవన్‌ కల్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై పోసానిని అసభ్యంగా ధూషించారంటూ చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ జోగినేని మణి ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం ఓబులవారిపల్లె పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

'12న తాడేపల్లి వెళ్లా-జగన్‌ను కలిశా' - పోలీసుల విచారణలో వల్లభనేని వంశీ

ప్రభుత్వ భూముల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామ్రాజ్యం - అంతు తేలుస్తున్న అధికారులు

Last Updated : Feb 27, 2025, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.