ETV Bharat / state

కల్తీ లేని కూరగాయలకు కేరాఫ్ ఆ గ్రామం - మీరు తెలుసుకోండి - CHANDRU THANDA ORGANIC FARMING

ఆర్గానిక్ కూరగాయలకు చిరునామా ఈ ఊరు - మెదక్ జిల్లాలోని చంద్రు తండాలో ప్రతి కుటుంబం కూరగాయల సాగు - పూర్తిగా సేంద్రీయ పద్దతుల్లోనే సాగు - ప్రతి ఇంటికి ఒక ఆవు

Chandru Thanda Organic Vegetables Farming
Chandru Thanda Organic Vegetables Farming (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 7:17 PM IST

Chandru Thanda Organic Vegetables Farming : సాధారణంగా ఏ గ్రామంలో అయినా ఒకరు లేదా ఇద్దరు కూరగాయలు సాగు చేయడం చూస్తూ ఉంటాం. కానీ మెదక్​ జిల్లాలో ఊరు ఊరంతా కూరగాయల సాగు అదీ సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉండటం విశేషం. అలాగే గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఆవును పెంచుకుంటున్నారు. భూగర్భ జలాలు ఇంకాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఇంకుడు గుంతను తవ్వుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఇంటికి ఒక మామిడి, బొప్పాయి, జామ, కొబ్బరి, సపోటా సహా వివిధ రకాల పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు.

ఒక ఆవు బహూకరణ : జిల్లాలోని టేక్మాల్ మండలం చంద్రు తండాలో 150 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 550. ఈ ఊళ్లోని ప్రతీ కుటుంబం వారికి ఉన్న సాగుభూమిలో ఎన్ని రకాల పంటలు వేసుకున్నా 10 గుంటలు మొదలుకుని ఎకరం వరకు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. ఇంటి ముందు, వెనక ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ నాలుగు నుంచి ఐదు రకాల కూరగాయ మొక్కలు నాటేస్తారు. అది కూడా సేంద్రియ సాగు విధానంలో పంటలు పండించడం విశేషం. చంద్రుతండాలో సేవాలాల్, దుర్గమ్మ గుడి కట్టే సమయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మదవానంద స్వామి సరస్వతి స్వామి తండాకు వచ్చారు. గ్రామస్థులు సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ ఉండడాన్ని చూసి ఇంటికి ఒక ఆవును బహూకరించారు.

పంటలు సాగుచేయడానికి సమావేశం : చంద్రుతండాలో ప్రతి ఇంటికి గేదెలు కూడా ఉంటాయి. కూరగాయలు పెంచడానికి సేంద్రియ ఎరువులనే వాడతారు. ఆవు పేడ, గో మూత్రం, కోడి పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు మార్కెట్‌కు తీసుకెళ్లిన కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడైపోతాయని రైతులు తెలిపారు. మార్కెట్‌లో కొనడానికి వచ్చిన వినియోగదారుల్లో కొందరు చంద్రుతాండ రైతులు ఎక్కడున్నారు అని అడిగి మరీ వారి వద్ద కొనుక్కుని వెళ్తారు. సేంద్రియ పద్దతితో ఎంతో జాగ్రత్తగా పెంచి, మార్కెట్ కి తీసుకెళ్తారు. కాబట్టి అందుకు తగ్గ రేటుకే అమ్ముతారు. అంతేకాదు ఊరంతా ఒకే విధంగా వ్యవసాయం చేయాలంటే అందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉండాలి. అందుకని, అందరూ కలిసి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని పంటలు వేస్తారు.

ఉత్తమ గ్రామం అవార్డ్​ : ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువ అవుతుండడంతో చంద్రుతండా వాసులు ఊరిని కాపాడుకునేందుకు ఊళ్లో ప్లాస్టిక్‌ను నిషేధించారు. తడి, పొడి చెత్త వేరు చేస్తారు. ఇంటికి ఇంకుడు గుంతలు ఉండటంతో ఎక్కడ కూడా మురుగునీరు కనిపించదు. ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఈ ఊరికి ఉత్తమ గ్రామం అవార్డ్ కూడా వచ్చింది. కూరగాయల సాగుతో గ్రామస్థులకు రోజు ఆదాయం వస్తోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండిస్తుండటంతో మార్కెట్‌లో మంచి రేటు వస్తోంది.

ప్రభుత్వం సాయం కావాలి : ఇక్కడి రైతులు వికారాబాద్, శంకర్‌పల్లి, కామారెడ్డి, తూప్రాన్, మెదక్ ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తనాలను తెస్తారు. టొమాటో, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు. బీరకాయ, కాకరకాయ, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి లాంటి పంటలు వేస్తారు. మొక్కలకు పురుగు పడితే జీవామృతం పిచికారీ చేస్తారు. పండినపంటను టేక్మాల్, ఎల్లుపేట, బోడ్మట్ పల్లి, వార్నింగి, పాపన్నపేట, జోగిపేట, వట్పల్లి గ్రామాల్లోని వారాంతపు సంతల్లో అమ్మేస్తారు. అయితే భారీ ఎత్తున కూరగాయలు సాగు చేస్తున్న తండావాసులకు డ్రిప్పు సబ్సిడీ లేదని ప్రభుత్వం దాన్ని కల్పించినట్లయితే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచుకుంటామని చెబుతున్నారు.

"చాలా రోజుల నుంచి మా వాళ్లు ప్రతి ఇంటికి కూరగాయలు పండిస్తున్నారు. అధికారులు మా ఊరిని సందర్శించి పరిశీలించారు. మా తాండాకు ఉత్తమ గ్రామం అవార్డ్ కూడా ఇచ్చారు. మా ఇళ్లలో ఎప్పుడూ కూరగాయలు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవులు, గేదేలు ఉంటాయి. ప్రభుత్వం సహాయం చేస్తే సాగు విస్తీర్ణాన్నిపెంచుకుంటాం." - చంద్రు తండా రైతులు

వాట్​ ఏ థాట్ : ఉన్న పొలం ఎకరం - పండించేది గుంటగుంటకో రకం

ఆర్గానిక్‌ ఎరువులు కొంటున్నారా? - ఓసారి చెక్ చేసుకోండి అది 'ఉప్పు' కావొచ్చు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.