NOTICES TO YSRCP LEADER GORANTLA MADHAV: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని మాధవ్‌పై విజయవాడలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అనంతపురంలోని గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లి, మార్చి 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. గోరంట్లకు సెక్షన్ 35 (3) కింద నోటీసు అందజేసిన పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు రావాలని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు