ETV Bharat / state

దళితులపై జగన్ కపట ప్రేమ - చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు

No SC ST Welfare in YSRCP Govt: నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ సీఎం జగన్ మాటల్లో ప్రేమను ఒలకబోస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఉపకరించే ఎన్నో పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కొన్నింటికి కత్తెరేసింది. జనాభా పరంగా తమకు దక్కాల్సిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించడం ఎంతమేరకు సబబని ఎస్సీ, ఎస్టీ, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.

No_SC_ST_Welfare_in_YSRCP_Govt
No_SC_ST_Welfare_in_YSRCP_Govt
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:32 PM IST

దళితులపై జగన్ కపట ప్రేమ- చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు

No SC ST Welfare in YSRCP Govt: నా ఎస్సీ(SC), నా ఎస్టీ(ST) అంటూ ప్రేమ ఒలకబోస్తున్న జగన్(CM Jagan) వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. దళిత బిడ్డలను చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారు. నవరత్నాల(Navratna welfare schemes) ద్వారా వారి జీవన ప్రయాణంలో వెలుగులు నింపుతామని తేనె పలుకులు పలికి మాయ చేశారు. ఎస్సీల సంక్షేమానికి ఉపయోగపడే 27 పథకాలను పూర్తిగా రద్దు చేయగా మరికొన్నింటికి కత్తెర వేశారు. నిధులు మళ్లించి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఎదుగుదలను దెబ్బతీశారు. ఇలా అన్ని విధాలుగా జగన్ ఏలుబడిలో దళితులు దగా పడుతున్నారు.

దళిత బాంధవుడిగా తనకు తానే పేటెంట్ ఇచ్చుకున్న జగన్ వారిని నమ్మించి నట్టేట ముంచారు. సంక్షేమ పథకాలకు మంగళం పాడిన వైసీపీ పాలన(YSRCP Govt) ఎస్సీలకు శాపంగా మారిందనండలో అతిశయోక్తి లేదు. చాలా పథకాలను పూర్తిగా అటకెక్కించగా మరికొన్నింటికి నిధుల్లో కోత విధించింది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(Ambedkar Overseas Education Fund) ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం(TDP Govt) ఎంతో మంది పేద దళిత విద్యార్థులకు అండగా నిలిచింది.

దళితుల అణచివేతకు వ్యతిరేకంగా 11న 'దళిత సింహ గర్జన'

కానీ జగనన్న విదేశీ విద్యా విధానం(jagananna Videsi Vidyadeevena Scheme)లో అనేక కొర్రీలతో పేదలు చదువుకు దూరమయ్యారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని(Best Available Schools Scheme) అటకెక్కించడంతో 20 వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌(Ambedkar Study Circle)ను కూడా మూసేసింది.

ఫలితంగా యూపీఎస్​సీ(UPSC), గ్రూప్-1(Group-1), గ్రూప్‌-2(Group-2), ఇతర అభ్యర్ధులకు శిక్షణ అందని ద్రాక్షగానే మారింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు(Post Matric Scholarships) పొందే విద్యార్థుల(Students)కు బుక్ బ్యాంక్ స్కీము(Book Bank Scheme)ను నిర్వీర్యం చేసింది. ఇలా ఒకటేమిటి ఎన్నో పథకాలను నిర్వీర్యం చేసి దళిత బిడ్డల జీవితాలతో ఆటలాడుకుంటోంది.

చంద్రబాబు(TDP Chief Nara Chandrababu Naidu) పాలనలో ఎస్సీ కార్పొరేషన్(SC Corporation) దళితులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. అలాంటి ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల పేరుతో మూడు ముక్కలు చేసిన జగన్ ఏ ఒక్క కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదు. ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. సంక్షేమ పథకాల పేరిట ఉత్తుత్తి బటన్‌లు నొక్కడం తప్ప ఒక్క రూపాయి విదల్చలేదు.

వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి: దళిత నేతలు

ఎస్సీలకు వ్యవసాయ మోటార్లు(Agricultural Motors), విద్యుత్ కనెక్షన్లు(Electrical Connections), విత్తనాలు(Seeds), ఎరువుల(Fertilizers) కొనుగోలు రాయితీకి మంగళం పాడారు. మరోవైపు దళిత వాడల్లో మౌలిక సదుపాయాలను గాలికొదిలేశారు. వీటన్నింటినీ వదిలేసి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మాత్రం పదేళ్లు పొడిగించడం వల్ల ఒరిగిందేంటని ఎస్సీసంఘాల నేతలు నిలదీస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందే తప్ప తమ అభ్యున్నతికి ఏమాత్రం తోడ్పడట్లేదని దళిత నేతలు మండిపడుతున్నారు. సామాజిక న్యాయం అంటూ 206అడుగుల అంబేడ్కర్ విగ్రహం(Ambedkar Statue) పెడితే సరిపోతుందా అని నిలదీస్తున్నారు. తమను చిన్నచూపు చూస్తూ మోసగించిన జగన్‌కు మళ్లీ ఓటెందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.