ETV Bharat / state

నిమ్మకూరులో బాలకృష్ణకు అఖండ స్వాగతం - NANDAMURI BALAKRISHNA IN NIMMAKURU

స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన నందమూరి బాలకృష్ణ - గ్రామంలోని పెద్దలు, బంధువులకు ఆప్యాయంగా పలకరింపు

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2025, 12:39 PM IST

Updated : Feb 27, 2025, 1:41 PM IST

NANDAMURI BALAKRISHNA IN NIMMAKURU: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో మాటామంతి కలిపారు. గ్రామంలోని పెద్దలను, బంధువులను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య, కుటుంబ విషయాలను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్మకూరులోని తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తనకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డలకు అవార్డు ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు. త్వరలోనే తన తండ్రి ఎన్టీఆర్​కి భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నామని అన్నారు. అమరావతిలో కూడా ఆసుపత్రిని నిర్మించేందుకు దాతలు సహకారం ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

తన తండ్రి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. దేశంలో ఏ నేత చేయనన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూసి, అధికారం ఇచ్చారని తెలిపారు. కాబట్టి అటువంటి మహోన్నత నేతకు త్వరలోనే కేంద్రప్రభుత్వం భారతరత్న ఇస్తుందని, ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలే పేర్లు మార్చి తీసుకొస్తున్నారని బాలకృష్ణ అన్నారు.

"పద్మభూషణ్​ వచ్చిన సందర్భంగా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడకి వచ్చాను. కొందరు ఏమో ఎప్పుడో రావాల్సింది అన్నారు. కానీ కాకతాళీయమో ఏమో, నేనైతే ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఎందుకంటే మా తండ్రి శతజయంతి గత ఏడాది పూర్తైంది. అదే విధంగా ఆయన మొదటి సినిమా మన దేశం విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే నేను కూడా చలనచిత్ర పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఇవన్నీ కలిసి వచ్చాయి అని అనుకుంటున్నాను. ఆ కళామతల్లి, ఆ పుణ్యదంపతుల ఆశీస్సులతో పాటు ప్రేక్షకుల ప్రోత్సాహం ఉంది. నేను ముందే చెప్పాను, నాకు వయస్సుతో పని లేదు". - నందమూరి బాలకృష్ణ, సినీ నటుడు

తుళ్లూరులో అతిత్వరలో క్యాన్సర్​ ఆస్పత్రిని ప్రారంభిస్తాం: బాలకృష్ణ

బాలయ్య, భువనేశ్వరి మధ్య నలిగిపోతున్నా - చంద్రబాబు చలోక్తి

Last Updated : Feb 27, 2025, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.