Fanatics Expands Its Digital Sports Innovation Centre : హైదరాబాద్‌లో ఫెనటిక్స్ కొత్త డిజిటల్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రకటించింది. దీనికి అభిషేక్ ధస్మానాను వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ మేనేజర్‌గా నియమించింది. 2026 నాటికి ఈ సంస్థ మరింతో బలోపేతం కానుందని తెలిపింది. రాబోయే రెండేళ్లలో డిజిటల్ స్పోర్ట్స్ విభాగంలో ఉపాధి అవకాశాల సంఖ్య రెట్టింపు కానుందని ధీమా వ్యక్తం చేసింది.
వచ్చే ఏడాదికి మరింత విస్తరణ : ఫెనటిక్స్ ప్రముఖ గ్లోబల్ డిజిటల్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్. 80 ప్రాంతాల్లో, 22వేల మంది ఉద్యోగులతో తమ కంపెనీని మరింత బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ విస్తరణ కోసం నిబద్ధతతో పని చేస్తామని వివరించింది. 2026 నాటికి హైటెక్ సిటీలో ప్రస్తుతం ఉన్నదాని కంటే సంస్థ విస్తరణ మూడు రెట్లు అధికమవుతుందని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఫెనటిక్స్ కార్యాలయంలో అభిషేక్ ధస్మానాను వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సంస్థలో ప్రతిభావంతులు పని చేస్తున్నారని, ఈ బృందంలో తనను చేర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాంకేతికత, ఏఐను ఉపయోగించుకుని మా సంస్థ భవిష్యత్తును రూపొందించడానికి ఎంతోగాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
"ఈ సంస్థలో నాకు భాగస్వామ్యం రావడం చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. ఈ సంస్థ విస్తరణ కోసం పని చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఇందులో చాలా మంది ప్రతిభావంతులు పనిచేస్తున్నారు. వారందరితో కలిసి పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులను ఆనందపరచడానికి కట్టుబడి ఉన్నాము." - అభిషేక్ ఫ్యానటిక్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్
ఫెనటిక్స్ ప్రభావ సాంకేతిక ప్రాజెక్టులను నడిపిస్తుందని, వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుందన్నారు. 2018లో ఫెనటిక్స్ తన మొదటి టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిందని అభిషేక్ తెలిపారు. వేలాది మంది అథ్లెట్లను ఈ వేదికపైకి తీసుకొస్తామన్నారు. ఫెనటిక్స్ కలెక్టబుల్స్, గేమింగ్‌లో ఉత్పత్తుల సేవలను అందింస్తుందని వివరించారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులు - రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ
తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు