DLSA is Solving the Problems of Lenders : సాటి మనిషికి ఆర్థిక సహాయం కోరితే కాదనకుండా ఇచ్చి చేతులు కాల్చుకోవడం, ఇచ్చిన అప్పులు వసూలు కాక ఏళ్ల తరబడి మానసిన వేదన అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న బాధితులు ఎంతోమంది.కొందరికైతే ఏం చేయాలో ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. అలాంటి తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా అప్పు తీర్చకుండా విసిగిస్త్తున్న వారి నుంచి డబ్బు, పరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరిస్తోంది సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ. రూ. లక్షలు అప్పుగా ఇచ్చి వసూలు కాక ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధితురాలికి డీఎల్ఎస్ఏ ఇరుపక్షాల మధ్య సమోధ్య కుదిర్చి ఉపశమనం కల్పించింది. బాధితురాలికి చెల్లించాల్సిన రూ.16,73,000, వడ్డీ కలిపి చెల్లించేందుకు రాజీ కుదిర్చింది.
కోర్టును ఆశ్రయించిన బాధితురాలు : ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒక వ్యక్తి ఆర్థిక అవసరాల కోసం ఖైరతాబాద్‌కు చెందిన మహిళ నుంచి ఆరేళ్ల క్రితం విడతలవారీగా అప్పు తీసుకున్నారు. తెలిసిన, నమ్మకం ఉన్న వ్యక్తి కావడంతో అడిగినప్పుడల్లా మొత్తం రూ.16,73,000 ఇచ్చారు. ఈ క్రమంలో ఆమెకు అవసరమైనప్పుడు డబ్బు అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో అంటూ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో బాధితురాలు నిద్రలేని రాత్రులు, మానసిక ఒత్తిడితో ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. చేసేదేమి లేక సిటీ సివిల్ కోర్డును ఆశ్రయించారు. కోర్టు ప్రిలిటిగేషన్ పరిగణించి న్యాయసేవాధికా సంస్థకు రిఫర్ చేసింది.
ఇళ్లు విక్రయించి డబ్బులు చెల్లించాలని తీర్పు : అనేక కౌన్సెలింగ్‌ల తర్వాత ప్రతివాది ఎల్లారెడ్డిగూడలో ఉన్న తన 1బీహెచ్‌కే ఫ్లాట్‌ను (504 చ.అ) విక్రయించి డబ్బులు చెల్లించేందుకు అంగీకరరించడంతో కథ సుఖాంతమైంది. అంతేకాకుండా బాధితురాలికి డబ్బులు అందని పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో తెలిపింది. ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు డబ్బు చెల్లించకపోతే ఫ్లాట్ యాజమాన్య హక్కులు బాధితురాలికి బదలాయించాలని వెల్లడించింది. విక్రయంలో విఫలమైతే ఒప్పందం ప్రకారం వాటికవే యాజమాన్య హక్కులు వర్తిస్తాయని తెలిపింది.
మీ పిల్లలు ఒంటరిగా ఫోన్లోనే గడుపుతున్నారా? - ముందే గుర్తించకపోతే మొదటికే మోసం!
అప్పులు తీసుకుని - అడిగితే బెదిరింపులు : ఆ మహిళా ఎస్పీ రూటే సెపరేటు
ఊరొళ్లకు అప్పులు లేకుండా చేసిన ఆవులు - 'పాడి' సంపదతో ఇంటింటా సిరులు