Degree Student Killed in Bodhan : చిన్న చిన్న కారణాలతో హత్యలు చేయడం వంటివి సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఈ వార్త చదివితే నిజ జీవితంలోనూ ఇలా జరుగుతుంది అన్న అనుమానం కలగకమానదు. ఈ నమ్మశక్యం కాని ఘటన వాస్తవంగానే జరిగింది. పరీక్షలున్నాయి మంచిగా చదువుకోమని చెప్పినందుకు గానూ డిగ్రీ విద్యార్థిని, ఇంటర్ విద్యార్థులు హత్య (Student Murder) చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Student Murder in Govt Hostel Bodhan : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చదువుకోమని చెప్పినందుకు ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థిని హత్య చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గాంధారి మండలంలోని తిప్పారం తండాకు చెందిన వెంకట్ (23) అనే యువకుడు బోధన్ పట్టణంలో బీసీ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు.
ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో, అదే హాస్టల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అల్లరి చేయకుండా చదువుకోవాలని సూచించాడు. ఇది మనసులో పెట్టుకున్న ఇంటర్ విద్యార్థులు, వెంకట్ పడుకున్నాక గొంతు నులిమి చంపినట్లు బంధువులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MLC Kavitha Reacts on Student Death : మరోవైపు వెంకట్ మరణించడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విద్యార్థి మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. కారణాలు ఏవైనా ఇలాంటి ఘటనలు బాధిత కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తాయని పేర్కొన్నారు. ఈ విషయమై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ శింగ్నేనవర్ శర్మతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, బాధిత వెంకట్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత జిల్లా అధికారులను కోరారు.
సమయానికి పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
"చిన్న కారణంలో మావాడి ప్రాణం తీశారు. వెంకట్ మృతిపై మాకు అనుమానాలున్నాయి. వెంకట్ రాత్రికే మరణించగా, హాస్టల్ వార్డెన్ ఉదయం వరకు మాకు సమాచారం అందించలేదు. ఇంత జరిగినా ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు. విద్యార్థులు గొడవపడిన సమయంలో వార్డెన్ హాస్టల్‌లో లేకపోవడం మా వాడి చావుకు దారి తీసింది. తక్షణమే హాస్టల్ వార్డెన్, వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలి". - మృతుడి బంధువు
లిఫ్ట్ ఇస్తానంటూ ఇంజినీరింగ్ విద్యార్ధినిపై అత్యాచారయత్నం
శిశువుకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక- హాస్టల్ వార్డెన్ సస్పెండ్