ETV Bharat / state

ముగిసిన బయో ఆసియా సదస్సు - రూ.5,445 కోట్ల పెట్టుబడులు - 10వేల కొత్త ఉద్యోగాలు - BIOASIA CONFERENCE CONCLUDE

రెండు రోజుల పాటు జరిగిన బయో ఆసియా సదస్సు - రూ.5,445 కోట్ల పెట్టుబడులు - 10 వేల కొత్త ఉద్యోగాలు -ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 స్టార్ట్​అప్​లకు బహుమతులు

Bio Asia Conference 2025
Bio Asia Conference 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 8:53 AM IST

Updated : Feb 27, 2025, 9:13 AM IST

Bio Asia Conference 2025 : బయో ఆసియా సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. రూ.5,445 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన కంపెనీల వల్ల దాదాపు 10 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పలు అంతర్జాతీయ లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, ఇంజనీరింగ్ కంపెనీలతో పాటు అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 స్టార్ట్‌అప్‌లకు ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు. వివిధ దేశాలకు చెందిన ఫార్మారంగ నిపుణులతో పాటు దేశంలోని శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు, ఏఐ కంపెనీల ప్రతినిధులు, ఫార్మా విద్యార్థులు పాల్గొని స్టాళ్లను తిలకించారు.

హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన బయో ఆసియా సదస్సు విజయవంతంగా ముగిసింది. 'మార్పునకు ఉత్ప్రేరకం' అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్‌, ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.5,445 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీల వల్ల 10వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. 11 కొత్త కంపెనీలు గ్రీన్‌ ఫార్మాసిటీలో నెలకొననున్నాయి. దేశ విదేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా రంగంలో పరిశోధనలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కరించాల్సిన అంశాలపై 100 మంది నిపుణులు చర్చించారు. కంపెనీలు, అంకుర పరిశ్రమల మధ్య 200 కు పైగా సమావేశాలు జరిగాయి.

84కు పైగా అంకుర పరిశ్రమలు : బయో ఆసియా సదస్సులో 84కు పైగా అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి. లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, హెల్త్, మెడికల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. కృత్రిమ మేథను ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించే అంశంలో పలు సంస్థలు, స్టార్ట్‌అప్‌లు చేస్తున్న పరిశోధనలను స్టాళ్ల వద్ద ప్రదర్శించాయి. భారత్ బయోటెక్, రెడ్డీస్ ల్యాబ్, లారస్ ల్యాబ్, నోవార్టిస్‌ లాంటి ప్రముఖ కంపెనీలు సైతం ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తుల గురించి వివరించాయి.

ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన : జీవనశైలి విధానాల వల్ల ఎన్నో అంతుబట్టని రోగాలు వ్యాపిస్తున్నాయి. అలాంటి వ్యాధులకు ఔషధాలు కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధనలు, అభివృద్ధి గురించి చర్చించాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బయో ఆసియా లాంటి సదస్సుల వల్ల ఆవిష్కరణలు, క్లినికల్ ట్రయల్స్‌ విషయంలో తాజా స్థితిగతుల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అంకుర పరిశ్రమలకు ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు. బయో ఆసియా సదస్సుకు ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, వచ్చే ఏడాది మరిన్ని లక్ష్యాలతో నిర్వహిస్తామని లైఫ్‌ సైన్సెస్‌ విభాగం తెలిపింది.

ఎక్కడికైన సులువుగా తీసుకెళ్లే రక్తపరీక్షల సూట్​ కేస్ - డీఎన్​ఏ టెస్ట్​ చేసే మినీ యంత్రం

ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాల అభివృద్ధి : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Feb 27, 2025, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.