Balaji & Ajay Two Highly Educated Vizag Youngsters Shines in Oil Extraction Business : ఒకరేమో మెకానికల్ ఇంజినీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేశారు. మరొకరేమో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో Ph.d చేసి శాస్త్రవేత్తగా పని చేశారు. కానీ, ఇద్దరిలో ఏదో తెలియని వెలితి. ఇంకేదో సాధించాలనే తపన. దీనికి తోడు మనిషి అనారోగ్యానికి సహజమైన వంట పదార్థాలు లేకపోవడమే అనే నిజం వారిని ఒక దగ్గరికి చేర్చింది. మరి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఎన్ని చదువులు చదివినా, ఎంత ప్యాకేజీ సాధించినా, సంతృప్తి లేని ఉద్యోగం ఎక్కువ రోజులు చేయలేరు. అందులోనూ సొంతంగా వ్యాపారం చేయాలనే అలోచన. ప్రకృతిలో భాగం అవ్వాలనే మనస్తత్వం ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాటలన్నింటికీ సరిగ్గా సూట్ అవుతారు వీరిద్దరు. ఉద్యోగాలు మానేసి అంతర పంటలు, ఎద్దుగానుగ అడిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.
వీరి పేరు ఆండ్ర బాలాజీ, బాడిత అజయ్ కుమార్. బాలాజీది అనకాపల్లి జిల్లా. ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి నౌకా నిర్మాణ రంగంలో ఉద్యోగం సంపాదించాడు. ఇక అజయ్‌ది శ్రీకాకుళం జిల్లా. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో Ph.d చేసి శాస్త్రవేత్తగా పని చేశారు. ఉత్తరాంధ్ర, గ్రామీణ వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆలవాలం. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన నూనె తయారీ వైపు అడుగేశారీ యువకులు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఎద్దు గానుగలు సిద్ధం చేసుకున్నారు. వృత్తి నైపుణ్యం గల వారితో పాత కాలపు గానుగ తయారు చేయించి పలు రకాల నూనెలు అడిస్తూ స్వయంగా ఉపాధి పొందుతున్నట్లు చెబుతున్నారు.
ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు
గానుగ అడించడంతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్నారు. దాంతో సాగులో మంచి లాభాలు సాధించవచ్చని అంటున్నారు. గానుగ నూనె ఖరీదు ఎక్కువైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం చూడకుండా యువత స్యయం ఉపాధి వైపు అడుగేయాలని సూచిస్తున్నారు. గానుగ నూనే అడించడం, అంతర పంటలతో ఎడాది పొడవునా ఉపాధి పొందుతున్నట్లు చెబుతున్నారు.
ఉద్యోగం వద్దనుకుని పొలం బాట పట్టాడు - లాభాలు గడిస్తున్నాడు - YOUNG FARMER EARNING MORE