Jaiswal Breaks Gambhir Record : టీమ్ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు పరుగులు (1,136) చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2008 క్యాలెండర్ ఇయర్లో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (1134) పరుగులు చేశాడు. ఆ రికార్డును ఆసీస్‌తో జరుగుతున్న పెర్త్ టెస్టులో యశస్వి బద్దలుగొట్టాడు. దీంతో 16 ఏళ్ల తర్వాత గంభీర్ రికార్డు బద్ధలైంది.
అదరగొట్టిన యశస్వీ
ప్రస్తుత భారత హెడ్ కోచ్ 2008లో 8 మ్యాచ్‌ల్లో 70.67 సగటుతో 1,134 పరుగులు చేశాడు. అందులో 6 అర్ధ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి. 2024లో యశస్వీ జైస్వాల్ 12 మ్యాచ్‌ల్లో 55.28 సగటుతో 1161కు పైగా రన్స్ చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 2 శతకాలు ఉన్నాయి. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్ల జాబితాలో యశస్వీ జైస్వాల్, గంభీర్ తర్వాత మాజీ బ్యాటర్ సౌరభ్ గంగూలీ ఉన్నాడు. 1997లో గంగూలీ 848, 2002లో 945, 2007లో 1107 రన్స్ చేశాడు.
అగ్ర స్థానం కోసం!
అలాగే ఈ యంగ్ ఓపెనర్ ప్రస్తుత ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ ఉన్నాడు. 2024లో జో రూట్ 1338 పరుగులు బాదాడు. ఆ రికార్డును బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనే బద్దలుగొట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లేందుకు జైస్వాల్ ప్రయత్నిస్తున్నాడు.
Upper cut and a swoop shot for fours!@ybj_19 showing his full range in just his first game on Australian soil.
— BCCI (@BCCI) November 23, 2024
Live - https://t.co/gTqS3UPruo…… #AUSvIND pic.twitter.com/3XaKj1l9z2
కాగా, పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ విఫలమైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. 193 బంతుల్లో 90* పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. ఇక రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 172- 0తో నిలిచింది. దీంతో భారత్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతుకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
బుమ్రా పాంచ్ పటాకా - ఆ ఘనతతో కపిల్ దేవ్ సరసన చోటు!
'హలో, నీకన్నా నేనే ఫాస్ట్‌గా బౌలింగ్ వేస్తా' - టీమ్ఇండియా పేసర్‌కు ఆసీస్ క్రికెటర్ వార్నింగ్!