WPL 2024 Anchor Vijaya : మహిళల ప్రీమియర్ లీగ్ 2024 డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభంలోనే ఉత్కంఠగ సాగడం మొదలైంది. ఇప్పటికే రెండు మ్యాచులు కూడా పూర్తైపోయాయి. మొదటి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించగా , రెండో పోరులో యూపీ వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ టోర్నీలో క్రికెటర్లతో పాటు యాంకర్లు కూడా అభిమానులను ఆకర్షిస్తుంటారు. తమ అందం, వాక్చాతుర్యంతో ఫ్యాన్స్ మదిని దోచేస్తారు.
అలా ఈ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో యాంకర్‌గా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న భామ పేరు అర్చనా విజయ పూరి. గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడేస్తుంది. ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది యాంకర్లకు దీటుగా అర్చన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్రికెట్ అభిమానుల్లో చాలా మంది ఈమెకె ఫ్యాన్స్ అని బయట కథనాలు ఉన్నాయి. తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
అర్చనా కోల్‌కతాలో రాజస్థానీ కుటుంబంలో జన్మించింది. యూనివర్సటీ ఆఫ్ కోల్‌కతాలో డిగ్రీ పూర్తి చేసింది. 2004లో గెట్ గార్జియస్ అనే అందాల పోటీలో పాల్గొని టైటిల్ గెలిచింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది అర్చనా. టీవి షోలు, ఫుడ్, ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలు చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ 4కు యాంకరింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది.
ఇంకా ఈమె యాంకర్ మాత్రమే కాదు. డ్యాన్సర్ కూడా. ఝలక్దిఖ్లాజా షోలోనూ పాల్గొని సందడి చేసింది. తన పెర్ఫామెన్స్‌తో అందరినీ బాగా ఆకట్టుకుంది. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ పూరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఆమెకు ఓ బిడ్డ కూడా జన్మించాడు.
ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది అర్చనా. కఠినమైన డైట్ కూడా ఫాలో అవుతుంది. ఎక్కువ సమయం జిమ్‌కే కేటాయిస్తోంది. ఈమెకు ఫొటోషూట్లంటే కూడా మహా ఇష్టమట. చీరలు, మోడ్రన్ డ్రెస్‌లతో ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. స్విమ్మింగ్ చేయడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తుంది. అదే తన హాబీ కూడా అని చాలా సార్లు చెప్పింది.
డబ్ల్యూపీఎల్ 2024 : ఒకే ఒక్క సిక్సర్‌తో దూసుకొచ్చిన ఆటోవాలా కూతురు!