ETV Bharat / sports

ప్రాక్టీస్​కు గిల్, రోహిత్ దూరం - ఆందోళనలో ఫ్యాన్స్​! - ROHIT SHARMA SKIPS NET PRACTICE

కివీస్, భారత్ మధ్య ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ - ప్రాక్టీస్​కు గిల్, రోహిత్ దూరం!

Rohit Sharma Skips Net Practice
Rohit Sharma Skips Net Practice (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2025, 11:05 AM IST

Rohit Sharma Skips Net Practice : ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్​ల్లో గెలిచి టీమ్​ఇండియా మంచి ఊపు మీద ఉంది. మార్చి 2న కివీస్​తో జరగబోయే లీగ్ దశ ఆఖరి మ్యాచ్​లోనూ గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అకాడమీలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకాలేదట. దీంతో రోహిత్​కు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళపడుతున్నారు.

ముమ్ముర ప్రాక్టీస్
పాకిస్థాన్​పై విజయం తర్వాత టీమ్​ఇండియా ప్లేయర్స్ మొదటిసారి ఐసీసీ ఆకాడమీలో బుధవారం నెట్ ప్రాక్టీస్ చేశారు. ఫుట్ బాల్ ఆడటం, రన్నింగ్ చేయడం వంటివి చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదని తెలుస్తోంది. కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ పర్యవేక్షణలో రోహిత్ నెమ్మదిగా జాగింగ్ మాత్రమే చేశారని సమాచారం. పాక్​తో జరిగిన మ్యాచ్ లో రోహిత్​కు తొడ కండరాల గాయం ఇబ్బంది పెట్టిందట. అందుకే ప్రాక్టీస్ సెషన్​లో రోహిత్ కఠోర వ్యాయామాలు చేయలేదట. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ టీమ్ఇండియా ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సిబ్బందితో చర్చించాడు.

కోహ్లీ ప్రాక్టీస్- గిల్ దూరం
ప్రాక్టీస్ సెషన్​లో విరాట్ కోహ్లీ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. వారి ఓవర్లలోనే ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. అలాగే టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బౌలింగ్ వేశాడు. షమీ వేసిన బంతులు రెండుసార్లు కోహ్లీ ప్యాడ్​ను తాకాయి. హర్షిత్ రాణా, అర్ష్‌ దీప్ సింగ్ కూడా నెట్స్​లో చెమడోడ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్న శుభ్ మన్ గిల్ మాత్రం ప్రాక్టీస్ సెషన్​కు రాలేదు.

తిరిగొచ్చిన బౌలింగ్ కోచ్
వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ తిరిగి జట్టుతో చేరాడు. ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆయన హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్​గా రోహిత్ శర్మతో చర్చలు జరిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.