ETV Bharat / sports

29ఏళ్ల వెయిటింగ్- 3రోజుల ముచ్చటే అయ్యింది- ప్చ్​ పాక్! - PAKISTAN CHAMPIONS TROPHY

పాక్​ ఖాతాలో చెత్త రికార్డ్- 5 రోజులకే ముగిసిన ఆతిథ్య జట్టు జర్నీ!

Pakistan CT
Pakistan CT (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 27, 2025, 7:49 PM IST

Pakistan Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ చెత్త రికార్డు సొంతం చేసుకుంది. 2002లో గ్రూప్ స్టేజ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక్క విజయం సాధించకుండా, ఛాంపియన్స్​ ట్రోఫీ పట్టికలో అట్టడుగున నిలిచిన తొలి ఆతిథ్య దేశంగా ఘోర అవమానం మూటగట్టుకుంది. గ్రూప్ Aలో పాకిస్థాన్ కేవలం 1 పాయింట్, -1.087 నెట్​ రన్​రేట్‌తో ఎలిమినేట్‌ అయ్యింది. గురువారం జరగాల్సిన బంగ్లాతో జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల పాకిస్థాన్‌కు ఆ ఒక్క పాయింట్ దక్కింది.

మూడు రోజుల ముచ్చటే!
ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్థాన్ అనేక సంవత్సరాలు ​ఎదురుచూసింది. అనేక కాంట్రవర్సీల మధ్య ఎట్టకేలకు పాక్ 29ఏళ్ల తర్వాత ఛాంపియన్స్​ ట్రోఫీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కానీ, ఇది పాక్​కు మూడు రోజుల ముచ్చటే అయ్యింది. చివరికి ఒక్క విజయం లేకుండా టోర్నీ నుంచి తప్పుకొంది. ఆడిన తొలి రెండు మ్యాచ్​ల్లో ఘోర పరాజయం, చివరి మ్యాచ్ రద్దు అవ్వడం వల్ల అక్కడి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మొత్తంగా టోర్నమెంట్ మొదలైన ఐదు రోజులకే పాక్​ ఎలిమినేట్‌ అవ్వడం గమనార్హం.

కాగా, మొత్తంగా చూసుకుంటే 2000లో కెన్యా తర్వాత టోర్నమెంట్‌లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన రెండో ఆతిథ్య జట్టుగా అవతరించింది. అలానే గ్రూప్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన రెండో ఆతిథ్య జట్టు కూడా పాకిస్థానే అయ్యింది. 2009లో సౌతాఫ్రికా ఈ పరిస్థితిని ఎదుర్కొంది.

డిఫెండిగ్​ హోదాలో!
అలాగే పాక్ ఈ టోర్నీలో డిఫెండిగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. ఈ క్రమంలో టోర్నీలో ఒక్క మ్యాచ్​ నెగ్గకుండా, టోర్నమెంట్​ ముగించిన రెండో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. దీని కంటే ముందు ఆస్ట్రేలియా (2013) ఉంది. 2009లో కప్పు గెలిచిన ఆసీస్‌, 2013లో సత్తా చాటలేకపోయింది.

కాగా, గ్రూప్‌ A నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్‌కి వెళ్లనున్నాయి. ఈ రెండు జట్ల మధ్యే ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది.

పాక్ x బంగ్లా మ్యాచ్ వర్షార్పణం- డిఫెండిగ్ ఛాంపియన్​కు ఘోర అవమానం

ధోనీని కెప్టెన్​ చేసినా పాక్​తో ఏమీ చేయలేరు : సొంత టీమ్​పై మాజీ క్రికెటర్​ సెటైర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.