Pak vs Ban Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం పాకిస్థాన్- బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇరుజట్లకు చెరో పాయింట్ ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకుండానే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టింది. అటు బంగ్లాదేశ్‌ది కూడా అదే పరిస్థితి.
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌కూడా నెగ్గకుండా ఇంటిబాట పట్టడం ఆ జట్టు అభిమానులకు ఘోర అవమానకరం. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, భారత్‌తో ఆడిన పాక్ చిత్తుగా ఓడింది. దీంతో ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించిన పాక్, ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంత అభిమానుల ముందు పరువు కాపాడుకోవాలని భావించింది. కానీ, వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. కొంత సమయం తర్వాత వర్షం తగ్గినా, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడం వల్ల మ్యాచ్ నిర్వాహణ సాధ్యం కాలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
దీంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్ చెరో ఒక్క పాయింట్‌తో పట్టికలో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ఆదివారం గ్రూప్ Aలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్- ఎలో అగ్రస్థానంలో నిలుస్తుంది.
Rain has delayed the toss ahead of the #PAKvBAN clash in Rawalpindi 🌧️#ChampionsTrophy
— ICC (@ICC) February 27, 2025
LIVE UPDATES ⬇️https://t.co/sH1r63WCCD