ETV Bharat / sports

బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ క్రేజ్- అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్! - IND VS AUS BOXING DAY TEST 2025

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ- హాట్ కేకుల్లా అమ్ముడైన నాలుగో టెస్టు టికెట్లు

AUS vs IND
AUS vs IND (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 10, 2024, 2:24 PM IST

Ind vs Aus Boxing Day Test 2025 : బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ లక్షకుపైనే! అయితే ఈ మ్యాచ్​కు ఉన్న డిమాండ్ వల్ల, ప్రారంభానికి ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ డే- 1 టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయి.

తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్‌ టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే డిసెంబర్ 24న స్వల్ప సంఖ్యలో డే 1 టికెట్లు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. యాషెస్​ కాకుండా ఇతర జట్ల టెస్టు మ్యాచ్​కు ఇంత భారీగా మొత్తంలో టికెట్లు అమ్ముడవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, క్రికెట్​లో క్రిస్మస్ తర్వాతి రోజు ప్రారంభమయ్యే టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.

అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. రెండున్నర రోజుల్లో ముగిసిన ఈ టెస్టుకు మొత్తం 1,35,012 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇక 5 మ్యాచ్​ల ఈ సిరీస్​లో భాగంగా పెర్త్‌ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించగా, అడిలైడ్ టెస్టులో ఆసీస్‌ గెలిచింది. దీంతో సిరీస్ 1 - 1తో సమం అయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.