ETV Bharat / sports

SRH ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఈసారి ఆ ప్లాబ్లమ్స్​ ఉండవ్! - IPL 2025

హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఇకపై ఆ సమస్యలకు గుడ్ ​బై?

SRH IPL 2025
SRH IPL 2025 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 27, 2025, 6:54 PM IST

IPL 2025 SRH : 2025 ఐపీఎల్ ముంగిట తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్​కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుడ్​న్యూస్ చెప్పింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియాన్ని రెనోవేషన్​ చేయనున్నట్లు హెచ్​సీఏ తెలిపింది. ​సీటింగ్ కెపాసిటీ, టాయిలెట్స్ సహా అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపర్చనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హెచ్​సీఏ ప్రెసిడెంట్ జగన్​మోహన్ రావు గురువారం మీడియాకు చెప్పారు.

'హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. ఈసారి ఉప్పల్ స్టేడియం తొమ్మిది మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్టేడియాన్ని రెనోవేషన్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే టాయిలెట్స్, సీటింగ్, పెయింటింగ్​ సహా అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తాం. 15రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. ఈసారి మ్యాచ్​లు చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. ఇక గతేడాది బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్​ దక్కించుకున్నాం' అని జగన్​మోహన్ రావు తెలిపారు. దీంతో గతంలో స్టేడియంలో సీటింగ్, వాష్​రూమ్స్ విషయంలో ఇబ్బంది పడిన అభిమానులకు ఇకపై ఆ ప్లాబ్లమ్స్​ ఉండవన్నమాట!

కాగా, ఈసారి ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్​లు జరగనున్నాయి. అందులో 7 సన్​రైజర్స్​ హోమ్ మ్యాచ్​లు కాగా, మరో రెండు క్వాలిఫైయర్ గేమ్స్. మార్చి 02న సన్​రైజర్స్ ప్రాక్టీస్ క్యాంపు ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో ఎస్​ఆర్​హెచ్ ప్లేయర్లు నెట్స్​తో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక మార్చి 22న 2025 ఐపీఎల్ ఎడిషన్​కు తెర లేవనుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను ఐపీఎల్​ నిర్వాహకులు ఇప్పటికే విడుదల చేశారు.

సన్​రైజర్స్ పూర్తి షెడ్యూల్​:

  • మార్చి 23- రాజస్థాన్- హైదరాబాద్​
  • మార్చి 27- లఖ్‌నవూ- హైదరాబాద్
  • మార్చి 30- దిల్లీ క్యాపిటల్స్- వైజాగ్
  • ఏప్రిల్‌ 03- కోల్‌కతా నైట్​రైడర్స్- కోల్‌కతా
  • ఏప్రిల్‌ 06- గుజరాత్‌ టైటాన్స్- హైదరాబాద్
  • ఏప్రిల్‌ 12- పంజాబ్‌ కింగ్స్- హైదరాబాద్
  • ఏప్రిల్ 17- ముంబయి ఇండియన్స్- ముంబయి
  • ఏప్రిల్ 23- ముంబయి ఇండియన్స్- హైదరాబాద్
  • ఏప్రిల్ 25- చెన్నై సూపర్ కింగ్​- చెన్నై
  • మే 02- గుజరాత్‌ టైటాన్స్- అహ్మదాబాద్
  • మే 05- దిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
  • మే 10- కోల్‌కతా నైట్​రైడర్స్- హైదరాబాద్
  • మే 13- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు- బెంగళూరు
  • మే 18- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్- లఖ్‌నవూ

ఫైనల్​లో SRHకు షాక్- మళ్లీ రన్నరప్​గానే- పాపం కావ్య ఫీలైందిగా!

65 రోజులకు ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్! - SRH ఫస్ట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.