ETV Bharat / spiritual

ఆ రాశి వారిని కొందరు ఇబ్బంది పెట్టే ఛాన్స్- కానీ మీ మంచితనమే శ్రీరామరక్ష! - Daily Horoscope Today

Horoscope Today April 27th 2024 : ఏప్రిల్​ 27న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 4:30 AM IST

Horoscope Today April 27th 2024 : ఏప్రిల్​ 27న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి కనబరుస్తారు. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ మౌనమే వారికి గట్టి సమాధానం అవుతుంది. గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. మీ మంచితనాన్ని, ప్రశాంతతను ఇతరులు పాడు చేసే అవకాశం ఇవ్వకండి. చివరకు గెలిచేది ధర్మమే అని గుర్తు పెట్టుకోండి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల వారికి కలిసి వచ్చే కాలం. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీకి అవకాశం ఉంది. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పని నుంచి కొంత విరామం తీసుకుని ఈ రోజంతా సరదాగా గడుపుతారు. పనులు వాయిదా పడకుండా చూసుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది ఖర్చులు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. ఇంట్లో కలహాలకు అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంట్లో అనవసరమైన వాదనలు వస్తాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. మానసికంగా అశాంతికి గురవుతారు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మేలు. స్థిరాస్తి, న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే వారు మీ సమీపంలోనే ఉన్నారు. దైవబలం రక్షిస్తుంది. సుబ్రమణ్య స్వామిని పూజిస్తే సమస్యలు తొలగిపోతాయి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటారు. సన్నిహితుల సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనవసరంగా అన్నింటికీ ఉద్రేకపడే మీ స్వభావంతో చాలా నష్టపోతారు. సహనం లేకపోవడం వల్ల ప్రతి విషయంలో చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. ప్రయత్నపూర్వకంగా సహనంతో ఉండటానికి ప్రయత్నించండి. పరిణితితో, బాధ్యతాయుతంగా ఉంటే అందరి ప్రశంసలు పొందగలరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్నీ సర్దుకుంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతాయి. బంధుమిత్రుల నుంచి చిన్నపాటి కానుకలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యర్ధ ప్రసంగాల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాట తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆర్ధిక నష్టం సూచితం. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నవగ్రహ శ్లోకాలను చదువుకుంటే మేలు.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీ ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. అవివాహితులకు అతి త్వరలో వివాహం జరుగుతుంది. మీ మిత్రులు మీకు గొప్ప కానుకలను ఇచ్చి మిమ్మల్నిఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారంటీ! ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల వారు రాణిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇది మీలో ఉత్సాహం నింపుతుంది. మీ సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనుకోని సమస్యలు ఎదురుకావడం వల్ల గందరగోళంగా ఉంటారు. ఆరోగ్యం లోపిస్తుంది. పని ప్రదేశంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. బంధువుల నుంచి ఒక దుర్వార్త అందుతుంది. శివారాధనతో కష్టాలు గట్టెక్కుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.