CM Jagan Memu Siddam Bus Yatra started from Idupulapaya: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అధినేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు చేపట్టే, మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు.
ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభ: సీఎం జగన్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు తన తండ్రి రాజశేఖరరెడ్డి సమాధి వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. తల్లి విజయమ్మతో కలిసి పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. వీరన్న గట్టుపల్లి, వేంపల్లి జంక్షన్ ల వద్ద బస్సు పైనుంచి అభివాదం చేస్తూ ప్రజలను ఉద్దేశించి కాసేపు జగన్ మాట్లాడారు. వీయన్ పల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
వైసీపీ ఎన్నికల ప్రచారం - మార్చి 27 నుంచి జగన్ బస్సు యాత్ర
ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు: ఈ నెల 27 (మార్చి) నుంచి వైసీపీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు సాగుతుంది. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద, తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించిన జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రకు మేము సిద్ధం పేరుతో నామకరణం చేశారు. 21 రోజుల పాటుగా మేము సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.
ఎన్నికల వేళ మళ్లీ జనం బాట పట్టిన జగన్ - ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర - JAGAN BUS YATRA
ఈనెల 29న బహిరంగ సభ ఉండదు: మెుదటి రోజు బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకున్న జగన్ అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు వివిధ వర్గాల ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ నెల 28న నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు. గుడ్ ఫ్రైడే కారణంగా ఈనెల 29న బహిరంగ సభ ఉండదు. అలాగే 30వ తేదీన ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు.
బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకో- జగన్పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ - CM Jagan bus tour