ETV Bharat / offbeat

పల్లీ చట్నీతో గ్యాస్​ ప్రాబ్లమ్​ వస్తుంది - ఇడ్లీ, దోశలోకి కమ్మటి​ "టమాటా ఉల్లిపాయ చట్నీ"! - ONION TOMATO CHUTNEY

- బ్రేక్​ ఫాస్ట్​ను నెక్స్ట్​ లెవల్​ కు తీసుకెళ్లే చట్నీ - చాలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు!

HOW TO MAKE ONION TOMATO CHUTNEY
Onion Tomato Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 3:03 PM IST

Onion Tomato Chutney Recipe : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ, వడ, పూరి అంటూ చాలా వెరైటీలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ, అందులోకి చట్నీ మాత్రం మాగ్జిమమ్ పల్లీ చట్నీయే ఉంటుంది. రోజూ ఒకే చట్నీ బోర్​ కొడుతుంది. అంతేకాదు, అప్పటికే గ్యాస్​ ప్రాబ్లమ్​ ఉన్నవారిని ఈ చట్నీ కాస్త ఇబ్బంది పెడుతుంది. అందుకే మీకోసం ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాం. అదే, కమ్మని "ఉల్లిపాయ టమాటా చట్నీ".

దీన్ని చాలా తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల టిఫెన్స్​తో పాటు రైస్​లోకీ చాలా రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో దీన్ని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ నెక్ట్​ లెవల్​లో ఉంటుంది. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఆయిల్ - 1 టేబుల్​స్పూన్
  • ఆనియన్స్ - 2 (పెద్ద సైజ్​వి)
  • టమాటా - 1 (పెద్ద సైజ్​ది)
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తాలింపు కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - కొద్దిగా

అద్దిరిపోయే టిప్​తో "అల్లం చట్నీ" - రోడ్​ సైడ్​ టిఫెన్ బండ్ల సీక్రెట్ ఇదే!

తయారీ విధానం :

  • ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, టమాటాను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ, టమాటా ముక్కలను మెత్తగా ఉడకనివ్వాలి.
  • ఆ విధంగా ఉడికంచుకున్నాక అందులో కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లో చల్లారిన ఉల్లిపాయ మిశ్రమం వేసుకొని కొంచం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం పచ్చడిలోకి తాలింపు కోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో పోపు దినుసులు(జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు), ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • చివర్లో కొద్దిగా సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని "ఉల్లి టమాటా చట్నీ" మీ ముందు ఉంటుంది!
  • ఇది కనీసం రెండు, మూడు రోజుల పాటు ఫ్రెష్​గా ఉంటుంది! నచ్చితే, మీరూ ఓసారి ఈ పచ్చడిని ట్రై చేయండి.

అసలైన "కొబ్బరి చట్నీ" చేసే పద్ధతి ఇదీ - వేళ్లు నాకేస్తారంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.