ETV Bharat / offbeat

క్రిస్పీ అండ్​ టేస్టీ "జొన్న దిబ్బరొట్టెలు" - షుగర్​ పేషెంట్స్​ హాయిగా తినొచ్చు - చేయడం చాలా ఈజీ! - HOW TO MAKE JONNA DIBBA ROTTE

-జొన్నలతో ఎప్పుడూ రొట్టెలు ఎందుకు ? -సరికొత్తగా ఇలా జొన్న దిబ్బరొట్టెలు చేసేయండి

How to Make Jonna Dibba Rotte at Home
How to Make Jonna Dibba Rotte at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 10:17 AM IST

How to Make Jonna Dibba Rotte at Home: జొన్నలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. బరువు తగ్గడం, డయాబెటిస్​ కంట్రోల్లో ఉండటం సహా ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు వీటి వల్ల లభిస్తాయి. అందుకే ప్రస్తుత రోజుల్లో వీటి వాడకం ఎక్కువైంది. సాధారణంగా జొన్నలు అనగానే చాలా మందికి జొన్న రొట్టెలు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఇడ్లీలు, దోశలు అంటూ చేసుకుంటుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా జొన్నలతో సూపర్​ టేస్టీ దిబ్బరొట్టె కూడా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్​గా ఉండే దిబ్బరొట్టెను తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి లేట్​ చేయకుండా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • మినపప్పు - 1 కప్పు
  • జొన్న రవ్వ - 3 కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - సరిపడా

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి మినపప్పు తీసుకుని నీళ్లు పోసుకుని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి ఓ 5 గంటలపాటు నానబెట్టాలి.
  • అలాగే మరో గిన్నెలోకి జొన్న రవ్వ తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి ఈ రవ్వనూ 5 గంటల సేపు నాననివ్వాలి.
  • మినపప్పు బాగా నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా మిక్సీ జార్​ లేదా గ్రైండర్​లో వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇలా పప్పు మొత్తాన్ని రుబ్బుకుని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే నానిన జొన్న రవ్వనూ మరోసారి శుభ్రంగా కడగాలి.
  • ఇప్పుడు రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండుకుని మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని నీళ్లు లేకుండా పిండి పప్పులో కలుపుకోవాలి. పిండి గట్టిగా పిండకపోవడం వల్ల నీరు ఉండి మినపప్పు మిశ్రమం పల్చగా అవుతుంది. దీంతో దిబ్బరొట్టెలు వేయడం కుదరదు.
  • మినపప్పు, రవ్వ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పిండి పులిసి దిబ్బరొట్టెలు రుచికరంగా వస్తాయి.
  • మరుసటి రోజు ఉదయం మూత తీసి చూస్తే పిండి బాగా పులిసి ఉంటుంది. అప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. మీకు కావాలనుకుంటే అందులోకి జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి పాన్​ పెట్టి కొంచెం నూనె పోసుకోవాలి. నూనె బాగా కాలుతున్నప్పుడు రవ్వ మిశ్రమాన్ని రెండు గరిటెలు పోసి మందంగా స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి దిబ్బరొట్టెను రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా మీకు నచ్చినన్నీ దిబ్బరొట్టెలు వేసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్​లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇక దిబ్బరొట్టెలను వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్​ చేసుకుంటే సరి.
  • బరువు తగ్గాలనుకున్నవారు, షుగర్​ పేషెంట్స్​ వీటిని హ్యాపీగా, హెల్దీగా తినొచ్చు. నచ్చితే మీరూ ట్రై చేయండి.

సూపర్​ సాఫ్ట్​ "జొన్న ఇడ్లీలు" - డయాబెటిస్​ పేషెంట్లకు బెస్ట్​​ ఆప్షన్​ - టేస్ట్​ కూడా అదుర్స్​!

జొన్నలతో రొట్టెలు, దోశలే కాదు - ఇలా "ఉప్మా"ను ప్రిపేర్ చేసుకోండి! - ఆరోగ్యానికి ఎంతో మేలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.