ETV Bharat / offbeat

పది నిమిషాల్లో ఇన్​స్టంట్ "పొంగనాలు విత్ కొబ్బరి చట్నీ" - కాంబినేషన్ అదుర్స్ గురూ! - INSTANT PONGANALU RECIPE

బ్రేక్​ఫాస్ట్, స్నాక్స్​కి సూపర్ ఆప్షన్ - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు!

Instant Ponganalu Recipe
HOW TO MAKE INSTANT RAVA APPAM (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 1:30 PM IST

Instant Ponganalu Recipe : కొన్నిసార్లు బ్రేక్​ఫాస్ట్​ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన సమయం ఉండదు. దోస, ఇడ్లీ వంటివి చేసుకుందామంటే ఆ టైమ్​కి పిండి ఉండకపోవచ్చు. అలాంటి టైమ్​లో 10 నుంచి 15 నిమిషాల్లో సింపుల్​గా చేసుకునే ఒక సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, "ఇన్​స్టంట్ గుంత పొంగనాలు విత్ కొబ్బరి చట్నీ". ఈ కాంబినేషన్ బ్రేక్​ఫాస్ట్​లోకే కాదు ఈవెనింగ్ స్నాక్​గానూ అద్దిరిపోతుంది. ఈ సూపర్ కాంబినేషన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - 1 కప్పు
  • సన్నని ఉల్లిపాయ తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్​స్పూన్
  • టమాటా - 1 (మీడియం సైజ్​ది)
  • సన్నని క్యారెట్ తురుము - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సన్నని క్యాప్సికం ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు
  • వంటసోడా - పావుటీస్పూన్
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పెరుగు - అర కప్పు
  • ఆయిల్ - తగినంత
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - పావుటీస్పూన్
  • సన్నని కరివేపాకు తరుగు - కొద్దిగా

చట్నీ కోసం :

  • పచ్చికొబ్బరి ముక్కలు - అర కప్పు
  • అల్లం - అర అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - అర ముక్క
  • పుట్నాల పప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - 1 టేబుల్​స్పూన్
  • పుదీనా - కొద్దిగా
  • నిమ్మకాయ - అర చెక్క
  • తాలింపుకి సరిపడా పదార్థాలు

పిండి రుబ్బకుండానే - నిమిషాల్లో అద్దిరిపోయే "రవ్వ వడలు"! - టేస్ట్ అదుర్స్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో సన్నని బొంబాయి రవ్వ తీసుకోవాలి.
  • ఆపై అందులో సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, టమాటా ముక్కలు, సన్నని క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంటసోడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో పెరుగు వేసి మరోసారి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పొంగనాలకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని, మూతపెట్టి 5 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • పిండి నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, పుట్నాల పప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసుకోవాలి.
  • ఆ తర్వాత నిమ్మరసం పిండి, తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే చాలు. ఇన్​స్టంట్ కొబ్బరి చట్నీ రెడీ!

పచ్చి బఠాణీలతో "ఇడ్లీలు, గుంట పొంగనాలు" - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

  • ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని కాస్త వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్లుగా కలుపుకోవాలి. అయితే, ఇక్కడ పొంగనాల రుచి పెరగడానికి కొద్దిగా తాలింపుని పిండిలో యాడ్ చేసుకోండి.
  • అందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టి అరటేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పోపు దినుసులు, ఇంగువ, పసుపు, సన్నని కరివేపాకు తరుగు వేసుకొని వేయించుకోవాలి.
  • తాలింపు దోరగా వేగాక దాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పొంగనాల పిండిలో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలపాలి.
  • ఇప్పుడు స్టౌపై పొంగనాల పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పాన్ కాస్త వేడయ్యాక అన్నీ గుంటలలో అర చెంచా చొప్పున ఆయిల్ వేసి కాస్త వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఒక్కో గుంటలో నింపుకోవాలి.
  • ఆపై మూతపెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఒక వైపు బాగా కాలాక మరోవైపునకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత ఈ పొంగనాలను వేడివేడిగా ఒక ప్లేట్​లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ "ఇన్​స్టంట్ గుంత పొంగనాలు విత్ కొబ్బరి చట్నీ" రెడీ!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఇంట్లో ఈ డెడ్లీ కాంబినేషన్​ను ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఆస్వాదిస్తారు!

ఇంటిల్లిపాదికీ నచ్చే "సేమియా దోశ" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ సూపర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.