ADULTERATED PANEER : కల్తీ పాలే కాదు! కల్తీ పన్నీర్ కూడా మార్కెట్‌ను ముంచెత్తుతోంది. యూరియా, డిటర్జెంట్ వాడి పాలు తయారు చేస్తున్నట్లే వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు ఉపయోగించి పన్నీర్ తయారు చేస్తున్నారు. గత నెలలో సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 600 కిలోల నకిలీ పన్నీర్ పట్టుబడింది. పోలీసులు మచ్చ బొల్లారంలోని ఓ గోదాములో నకిలీ పన్నీరు స్వాధీనం చేసుకుని గోదామును సీజ్ చేశారు.
పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్
మార్కెట్లో కల్తీ పన్నీర్ ఎక్కువగా వస్తోందని అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ కల్తీ పన్నీర్‌ను సింథటిక్ పన్నీర్ అని అంటారు. మీరు మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న పన్నీర్ నకిలీదా లేదా నిజమైనదా అనే విషయాన్ని ఈ చిట్కాలతో తెలుసుకోండి.
ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. మసాలా దినుసులు మొదలుకుని కారం, పసుపు సహా అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ పన్నీర్ కూడా వెలుగు చూసింది. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రసాయనాలు వాడి తయారీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. శాకాహారులు పన్నీర్ ఎక్కువగా తీసుకుంటారు. దీనిని పాలు వేడి చేసి సహజ పద్ధతుల్లో తయారు చేయాల్సి ఉంటుంది. కానీ, పాలతో కాకుండా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి సింథటిక్ పన్నీర్ తయారు చేస్తున్నారు. ఇది చూడడానికి నిజమైన పన్నీర్ మాదిరిగానే ఉంటుంది. అందుకే కల్తీని గుర్తించడం కాస్త కష్టమే. ఇలాంటి పన్నీర్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంటల కొద్ది మెత్తగా ఉండే "సొరకాయ చపాతీ" - మీ పిల్లలు ఒక్కటి కూడా మిగల్చరు!

కల్తీ పన్నీర్‌ను ఇలా గుర్తించే వీలు
మార్కెట్లో కొనుగోలు చేసిన పన్నీర్ పై మీకు అనుమానం ఉంటే ఒక ముక్కను తీసుకుని చేతులతో నలిపి చూడండి. వేళ్లతో నలిపినప్పుడు సులభంగా పిండిలాగా మారిపోతే అది కల్తీ పన్నీర్ అని అర్థం. ఒకవేళ పిండిలాగా మారకుండా గట్టిగా ఉంటే అది నిజమైనదని గుర్తించాలి. పాలు వేడిచేసి తయారు చేసిన నాణ్యమైన పన్నీర్ అంత సులభంగా విరిగిపోదని తయారీదారులు చెప్తున్నారు.
రుచి చూసి కూడా తెలుసుకోవచ్చు!
కల్తీ పన్నీర్ ను గుర్తించడానికి ఇంకో మార్గం కూడా ఉంది. తెచ్చుకున్న పన్నీర్ ముక్కను నీళ్లలో మరిగించ చల్లార్చిన తర్వాత దాంట్లో కందిపప్పు పొడి చేసి కలపాలి. ఒక వేళ అది నకిలీది అయితే కాసేపటికి లేత ఎరుపు రంగులోకి మారుతుంది. దీంతో అది యూరియా, లేదా డిటర్జెంట్ తో కల్తీ చేశారని తెలుసుకోవచ్చు. అందుకే, పన్నీర్ కొనేముందే చేతులతో నలిపి చూడడం లేదా కొంచెం నోట్లో వేసుకుని రుచి చూసి నాణ్యతను గుర్తించాలి.
పన్నీర్ పాలతో తయారవుతుంది. సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా దీనిని తయారు చేస్తారు. ముందుగా పాలను బాగా మరిగించి అవి విరిగిపోయేందుకు వెనిగర్ లేదా నిమ్మరసం వేస్తారు. పాలు విరిగిపోగానే తెల్లటి వస్త్రంలో చుట్టి నీళ్లు వేరు చేస్తారు. కానీ, సింథటిక్ పన్నీర్ ను తయారుచేయడానికి యూరియా, వెజిటేబుల్ నూనె కొవ్వు, పిండి, రసాయనాలు వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే దొరుకుతుంది కదా అని ఇలాంటి కల్తీ పన్నీర్ తెచ్చుకుంటే అనారోగ్యం కొనుక్కున్నట్టే!
రాయలసీమ స్పెషల్ "ఎల్లిపాయ కారం" - ఇంట్లో కూరగాయలు లేనపుడు నోటికి కమ్మగా ఉంటుంది!
దోసెలు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి - రుచికరమైన "బబుల్ దోసెలు"