ETV Bharat / offbeat

శివరాత్రి వేళ ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలాయా? - ఇలా పచ్చడి చేశారంటే అన్నం రెండు ముద్దలు ఎక్కువే తింటారు! - HOW TO MAKE COCONUT CHUTNEY

-కొబ్బరి చిప్పలు మిగిలినప్పుడు టెన్షన్​ పడాల్సిన అవసరం లేదు -ఇలా పచ్చడి చేసుకుంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు

How to Make Coconut Chutney at Home
How to Make Coconut Chutney at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 12:58 PM IST

How to Make Coconut Chutney at Home: పరమ పవిత్రమైన మహా శివరాత్రి పూర్తయింది. పండగనాడు శివభక్తులు దేవాలయాలు, ఇళ్లల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన కొబ్బరి చిప్పలు మిగిలిపోయి ఉంటాయి. వాటిని కొద్దిమంది ఎండబెడితే, మరికొద్దిమంది ఎప్పుడూ చేసే విధంగా పచ్చడి, కొబ్బరి లడ్డూలు చేసుకుంటారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా చేసుకుంటే తినాలనిపించదు. అలాంటి సమయంలో మేము చెప్పే పద్ధతిలో చేసుకోండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా టేస్ట్​ అద్దిరిపోవాల్సిందే. పైగా తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె -4 టేబుల్​ స్పూన్లు
  • మినపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టేబుల్​ స్పూున్​
  • పచ్చిమిర్చి - 6
  • ఎండుమిర్చి - 10
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్​
  • పచ్చి కొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ ఎక్కిన తర్వాత జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  • తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి మరికొంచెంసేపు వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది మీరు తినే కారానికి తగినట్లు వేసుకుంటే సరిపోతుంది.
  • ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి మగ్గిన తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
  • ఇప్పుడు చింతపండు వేసి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. చివరగా పచ్చి కొబ్బరి ముక్కలు, పసుపు వేసి కొబ్బరి ముక్కలు బాగా వేగి లైట్​గా రంగుమారే వరకు ఫ్రై చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఇక్కడ కావాలనుకుంటే ఓ రెండు టమాటాలను కూడా ముక్కలుగా కట్​ చేసుకుని కొబ్బరి ముక్కలతో పాటు మగ్గించుకోవచ్చు.
  • కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుంటే సరి. ఎంతో కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు.
  • ఇక ఈ పచ్చడిని వేడివేడి అన్నం, నెయ్యితో తింటే ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటారు. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

అమ్మమ్మల కాలం నాటి "చింతకాయ కొబ్బరి పచ్చడి" - నోట్లో నీళ్లు ఊరిపోవడం గ్యారెంటీ!

షుగర్​, బరువును అదుపులో ఉంచే "క్యారెట్ కొబ్బరి జొన్న రొట్టెలు" - సింపుల్​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.