Dont Put These Things Bathroom: చాలా మంది తెలిసో, తెలియకో పలు వస్తువులు బాత్రూమ్‌లో పెడతారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని వస్తువులను బాత్‌రూంలో పెట్టకూడదు. దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి బాత్రూమ్‌లో పెట్టకూడని వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
మేకప్ ప్రొడక్ట్స్: చాలా మంది బాత్రూమ్లోని అద్దం దగ్గర కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకుంటారు. అందులో ఉండే తేమ.. మేకప్ ఉత్పత్తులు, బ్రష్, బ్లెండింగ్ స్పాంజ్‌ల వంటి వాటిపై బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని అక్కడ పెట్టకూడదు. అలాగే డైరెక్ట్ సన్‌లైట్ పడే ప్లేస్‌లో కూడా పెట్టకూడదు. చల్లని, పొడి వాతావరణంలో పెట్టాలి. ఉదాహరణకు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్.
ఆర్నమెంట్స్: కొద్ది మంది బాత్రూమ్లోనే ఆభరణాలు పెడతారు. అయితే వాటిని ఎక్కువ కాలం అక్కడ ఉంచడం వల్ల దుమ్ము, ధూళి చేరి అధ్వాన్నంగా మారతాయి. కాబట్టి బాత్రూమ్‌లో ఎటువంటి అలంకార వస్తువులు ఉంచకపోవడ మంచిది. బదులుగా లాంజ్, లివింగ్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు.
ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే మీ దంతాలు దెబ్బతినడం ఖాయం!
టవల్స్: చాలా మంది బాత్రూమ్ డోర్ వెనక హ్యాంగర్‌కు టవల్స్ తగిలిస్తారు. అవసరం ఉన్నప్పుడు తుడుచుకుని తర్వాత అదే ప్లేస్‌లో ఉంచుతారు. దీనివల్ల బాత్రూమ్లోని తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వాటి మీద చేరుతుంది. అంతేకాకుండా ఓ రకమైన వాసన కూడా వస్తుంది. కాబట్టి టవల్స్‌ను యూజ్ చేసిన తర్వాత ఎండలో ఆరవేయడం మంచిది.
క్లీనింగ్ ప్రొడక్ట్స్: ఇక చాలా మంది బాత్రూమ్ క్లీనింగ్‌కు సంబంధించిన ఉత్పత్తులను బాత్రూమ్లోనే ఓ మూలకు పెట్టేస్తారు. కానీ అలా పెట్టడం మంచిది కాదు. ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడూ బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో పొడి ప్రదేశాలలో నిల్వ చేయాలి.
టిష్యూ పేపర్స్: ప్రస్తుతం చాలా మంది వీటిని యూజ్ చేస్తున్నారు. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే.. నాలుగైదు టిష్యూ రోల్స్‌ను బాత్రూమ్‌లో పెట్టేస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంటున్నారు. దీని వల్ల ఆ రోల్స్‌పై దుమ్ము, ధూళి చేరి బ్యాక్టీరియా పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి వాటిని ఓ అల్మారాలో పెట్టడం మంచిదంటున్నారు.
మొబైల్ ఫోన్స్: ప్రస్తుతం ఫోన్ లేకుంటే బాత్రూమ్కు వెళ్లలేని పరిస్థితి. అయితే బాత్రూమ్‌లో ఫోన్ యూజ్ చేయడం వల్ల కంటికి కనిపించని బ్యాక్టీరియా ఫోన్‌పై చేరుతుంది. తర్వాత మనం ఫోన్‌ను ఉపయోగించినప్పుడు ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా అనారోగ్యానికి గురవుతాం. కాబట్టి బాత్రూమ్‌లో ఫోన్లు అవాయిడ్ చేయండి.
పుస్తకాలు, మ్యాగజైన్స్: చాలా మందికి బాత్‌రూంలో బుక్స్ లేదా మ్యాగజైన్ చదవడం వలవాటు ఉంటుంది. దీనివల్ల వాటిని బాత్‌రూంలో పెడతారు. అలా చేయడం వల్ల అవి మరింత పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. తేమ కారణంగా కాగితం ఉత్పత్తులు తేమను గ్రహిస్తాయి. దీంతోపాటు వాటిలో బ్యాక్టిరియా కూడా పెరగడం ప్రారంభమవుతుంది
రేజర్‌లు: షేవింగ్‌కు అవసరమైన రేజర్లును చాలా మంది ఒకటికి మించి బాత్రూమ్‌లో స్టోర్ చేస్తారు. బాత్రూమ్‌లో ఒక రేజర్ ఉండడం మంచిది. కానీ అదనపు రేజర్‌లను బాత్రూంలో నిల్వ ఉంచినట్లయితే అవి మొద్దుబారడం, తుప్పు పట్టడం వల్ల పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అలాగే ఉపయోగించిన తర్వాత రేజర్‌లను ఆరబెట్టడం, బ్లేడ్‌లను తరచుగా మార్చడం వల్ల వాటిని ఎక్కువసేపు మరింత ప్రభావవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్‌తో రిజల్ట్ పక్కా!
టూత్ బ్రష్ - ఇక చాలా మంది చేసే అతి పెద్ద తప్పు బాత్రూమ్‌లో టూత్‌బ్రష్ ఉంచడం. ఒక టూత్ బ్రష్‌లో 10 మిలియన్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండవచ్చు. ఎందుకంటే బాత్రూమ్‌లు సాధారణంగా తేమగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. టూత్‌బ్రష్‌లు తడిగా ఉన్నప్పుడు, బ్యాక్టీరియా వాటిపై సులభంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశించినప్పుడు అవి కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి మీ టూత్ బ్రష్‌ను వీలైనంత వరకు సూక్ష్మక్రిమి లేకుండా ఉంచడానికి.. ఉపయోగించిన తర్వాత కడిగి ఆరబెట్టండి. క్యాప్ ఉపయోగిచండి. అదనపు ముందు జాగ్రత్తగా, అప్పుడప్పుడు బేకింగ్ సోడాలో టూత్ బ్రష్‌ను నానబెట్టండి.. ఇది బ్యాక్టీరియాను చంపి తాజాగా ఉంచుతుంది. 2020లో జరిగిన ఒక అధ్యయనంలో బాత్రూమ్‌లో టూత్‌బ్రష్‌లు ఉంచిన వ్యక్తులలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఎందుకంటే టూత్‌బ్రష్‌ల ద్వారా నోటిలోకి చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం స్పష్టం చేశారు.
How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!