Top Kannada Movies To Watch In OTT : పాన్ ఇండియా ట్రెండ్ మొదలు కాకముందు నుంచే పలు రీజనల్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అందరినీ ఆయా ఇండస్ట్రీల వైపుకు చూసేలా చేశాయి. అందులో కన్నడ ఇండస్ట్రీ కూడా ఉంది.
'కేజీఎఫ్', 'కాంతార' సినిమాలతో ఆ ఇండస్ట్రీ గురించి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చలు మొదలయ్యాయి. వాళ్ల మేకింగ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడటం మొదలెట్టారు. ఆ చిత్రాలు భారతీయ సినీ చరిత్రను ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో మూవీ లవర్స్ శాండల్‌వుడ్‌పై ఓ లుక్కేయడం ప్రారంభించారు. కన్నడలో పలు సినిమాలను చూసి వాటిని కూడా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో పలు డిజిలట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా తమ వేదికల్లో మంచి మంచి కన్నడ సినిమాలను స్ట్రీమ్ చేస్తున్నారు అవేంటో మీరూ చూసేయండి మరి.
1. గరుడ గమన వృషబ వాహన (2021) : కన్నడ స్టార్ హీరో రాజ్ బి శెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆయనే లీడ్ రోల్ పోషించారు. ఇక ఆయనతో పాటు 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి, గోపాల్ దేశ్ పాండే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో స్టీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. తీత్తి (2015) : రామ్ గౌడ రూపొందించిన ఈ చిత్రంలో చెన్న గౌడ, సింగరి గౌడ, పూజ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం యుట్యూబ్లో అందుబాటులో ఉంది.
3. కిరిక్ పార్టీ (2016) : యంగ్ సెన్సేషన్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కిరిక్ పార్టీ' యూత్‌ను తెగ ఆకట్టుకుని సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా రాణిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు రష్మికకు హీరోయిన్గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇప్పుడు జియో సినిమాలో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. రంగీతరంగ (2015) : కన్నడలో వచ్చిన బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్‌లో సినిమాల్లో ఇది ఒకటి. అనూప్ బండారీ తెరకెక్కించిన ఈ సినిమాలో నిరూప్ బండారీ, రాధిక నారాయణ్, సాయి కుమార్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ (Mx Player)లో అందుబాటులో ఉంది.
5. రాజకుమారా (2017) : కన్నడ పవర్‌స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ లీడ్ రోల్లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ 'రాజకుమారా'. సంతోష్ ఆనంద్రం తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 6 కన్నడ మూవీస్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం ఈ చిత్రం సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. లూసియా (2013) : క్రౌడ్ ఫండింగ్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే మంచి టాక్ అందుకుని రికార్డుకెక్కింది. నిద్రలేమితో బాధపడుతున్న ఓ వ్యక్తి నిజానికి, భ్రమకి తేడా తెలియకుండా చేసే లూసియా అనే డ్రగ్ గురించి ఈ మూవీ. అది తీసుకున్నాక అతడి జీవితంలో జరిగిన పరిణామాల గురించి ఈ సినిమా కథ. ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతోంది.
7. హీరో (2021) : రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ భరత్ రాజ్ రూపొందించారు. కర్ణాటకలో చిక్కమంగుళూరు ప్రాంతంలోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. మొగ్గిన మనసు (2008) : శాండల్‌వుడ్ స్టార్ కపుల్ రాధిక పండిత్, యశ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో రాధిక హీరోయిన్గా కనిపించగా, యశ్ ఓ సపోర్టింగ్ రోల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకు ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్ సంస్థ 5 అవార్డులతో సత్కరించింది. ఈ చిత్రం ప్రస్తుతం యుట్యూబ్లోనూ ఉంది.
9. గోధి బన్నా సాధారణ మికట్టు (2016) : ఇది స్టార్ హీరో రక్షిత్ శెట్టి సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటి. ఇందులో కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కీలక పాత్ర పోషించారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. ఓం (1995) : కన్నడ సూపర్‌స్టార్ శివ రాజకుమార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. నటుడిగా అతనిలోని విశ్వరూపాన్ని ఆడియెన్స్ ఈ సినిమాలో చూడచ్చు. ప్రస్తుతం ఈ సినిమా యుట్యూబ్ లో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">