ETV Bharat / business

శాంసంగ్‌ నుంచి మరో 2 బడ్జెట్ 5G ఫోన్లు - ఏకంగా 6 ఏళ్ల అప్‌డేట్స్‌తో - SAMSUNG GALAXY M16 PRICE IN INDIA

శాంసంగ్ నుంచి 2 కొత్త ఫోన్స్ లాంచ్ - 6 సంవత్సరాల అప్​డేట్స్​తో గెలాక్సీ M16, గెలాక్సీ M06

Samsung Galaxy M16 Price In India
Samsung Galaxy M16 Price In India (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 4:53 PM IST

Samsung Galaxy M16 Price In India : ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ బడ్జెట్‌ సెగ్మెంట్‌లో 2 కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. తన గెలాక్సీ ఎం సిరీస్‌లో గెలాక్సీ M16, గెలాక్సీ M06 పేరిట 5జీ మొబైళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. ఈ 2 ఫోన్లు చాలా వరకు ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. పైగా ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్ 15తో పని చేసే వన్‌యూఐ7తో వస్తుండడం విశేషం. M16కు ఆరు సంవత్సరాల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని శాంసంగ్‌ కంపెనీ హామీ ఇస్తోంది. ఈ 2 ఫోన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను మనం ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్‌ M16 వివరాలు ఇలా ఉన్నాయి : -

  • శాంసంగ్‌ M16 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 90Hz రిఫ్రెష్‌ రేటు ఉంది.
  • ఐ-కేర్‌ షీల్డ్‌, విజన్‌ బూస్టర్‌ సదుపాయాలు ఉన్నాయి.
  • మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌ ఉంది. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ వేరియంట్లతో వస్తోంది. ఇంటర్నల్‌ స్టోరేజీ 128 జీబీ ఆప్షన్‌తో వస్తోంది.
  • ఇందులో 50ఎంపీ కెమెరా ఉంది. 2 ఎంపీ మ్యాక్రో షూటర్‌, 5 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.
  • సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • శాంసంగ్‌ M16 బ్లుష్‌ పింక్‌, మింట్‌ గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • M16 ధర రూ.11,499 నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చే 5 నుంచి అమెజాన్‌లో దీని విక్రయాలు మొదలవుతాయి.

శాంసంగ్‌ M06 వివరాలు ఇలా ఉన్నాయి : -

  • శాంసంగ్‌ M06 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది.
  • ఇందులోనూ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌నే అమర్చారు.
  • 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభిస్తుంది. 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంది.
  • ఔటాఫ్‌ది బాక్స్‌ వన్‌యూఐ 7తో వస్తోంది. 4 సంవత్సరాల పాటు ఓఎస్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని శాంసంగ్‌ కంపెనీ చెబుతోంది.
  • కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.
  • 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.
  • గెలాక్సీ M06 మొబైల్‌ బ్లాక్‌, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.
  • గెలాక్సీ M06 ధర రూ.9,499 నుంచి ప్రారంభం అవుతుంది. వచ్చే నెల 7 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

హువావేకు ధీటుగా శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్​!- రిలీజ్ ఎప్పుడో తెలుసా?

పవర్​ఫుల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15తో శాంసంగ్ 5G స్మార్ట్​ఫోన్!- కేవలం రూ.10,499లకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.