ETV Bharat / business

మీ క్రెడిట్ స్కోర్ 800కు పైగా ఉందా? కోరుకున్న ఉద్యోగం, తక్కువ వడ్డీకే బ్యాంక్‌ లోన్‌, ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ గ్యారెంటీ! - GOOD CREDIT SCORE BENEFITS

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే చాలు - తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, బీమా ప్రీమియంపై డిస్కౌంట్స్‌ వస్తాయ్‌! - BFSI సెక్టార్‌ జాబ్స్‌ కూడా!

Credit Score
Credit Score (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Good Credit Score Benefits : మీకు మంచి క్రెడిట్/ సిబిల్ స్కోర్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్‌. మీకు తక్కువ వడ్డీకే ఈజీగా బ్యాంక్‌ లోన్స్‌ లభిస్తాయి. ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అంతే కాదు BFSI సెక్టార్‌లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

తక్కువ వడ్డీకే లోన్‌
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు చాలా సులువుగా పర్సనల్ లోన్‌ , హోమ్ లోన్‌, కార్ లోన్స్‌ అందిస్తాయి. అంతేకాదు తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి.

మంచి క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక చరిత్రను, రుణం తీర్చగలిగే సామర్థ్యాన్ని, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, బాధ్యతలను తెలుపుతుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు - తాము ఇచ్చే రుణాలపై 20 bps - 80 bps వరకు వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది. (bps = బేసిస్ పాయింట్స్‌)

ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్‌
క్రెడిట్ స్కోర్ 800కు పైగా ఉంటే - బ్యాంకులు చాలా సులువుగా కారు/ బైక్‌, హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందిస్తాయి. అంతేకాదు వాటి ప్రీమియంలపై డిస్కౌంట్స్‌ కూడా ఇస్తాయి. ఆయా బ్యాంకులను బట్టి ఈ డిస్కౌంట్ 5% - 15% వరకు ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తుల రిస్క్‌ అసెస్మెంట్‌ను తెలుసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బీమా సౌకర్యం కల్పించినా పెద్దగా రిస్క్ ఉండదని బ్యాంకులు భావిస్తాయి. కనుక బీమా ప్రీమియంలపై మంచి డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి.

క్రెడిట్ కార్డ్ అఫ్రూవల్‌
మీ క్రెడిట్ స్కోర్ 750 - 800 పాయింట్ల మధ్య ఉంటే, బ్యాంకులు మీకు కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ఇష్టపడతాయి. అంతేకాదు హయ్యర్ క్రెడిట్ లిమిట్‌తో, తక్కువ వడ్డీ రేటుతో, మంచి రివార్డ్స్, బెనిఫిట్స్‌తో ప్రీమియం క్రెడిట్ కార్డులు కూడా అందిస్తాయి.

నోట్ : బ్యాంకులు, ఆర్థిక సంస్థలను బట్టి రుణాల వడ్డీ రేట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. మీకు వీటిపై సరైన అవగాహన లేకపోతే, మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఉద్యోగ అవకాశం
ప్రస్తుతం బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్లలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. హైరింగ్ ప్రాసెస్‌లో మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌కు చెందిన కంపెనీలు అభ్యర్థికి తెలియకుండా వారి క్రెడిట్ స్కోర్‌ను గానీ, క్రెడిట్ హిస్టరీని గానీ చెక్ చేయవు. అభ్యర్థుల అనుమతితోనే వారి క్రెడిట్ హిస్టరీని, స్కోర్‌ను చూస్తాయి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ, ఎలాంటి డిఫాల్టులు లేకుండా, మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి జాబ్స్‌ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి.

ఈ తప్పులు చేయవద్దు!
క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు తీసుకునేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, తరువాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు బిల్లులను, లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్‌లో కేవలం 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరుగతుంది. లేకుంటే మీ క్రెడిట్ స్కోర్‌ తగ్గడమే కాదు, భవిష్యత్‌లో మీకు రుణాలు లభించే అవకాశం కూడా తగ్గుతుంది.

నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

నిరుద్యోగులు కూడా మంచి క్రెడిట్ స్కోర్​ మెయింటెన్ చేయొచ్చు! ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీ!

క్రెడిట్ స్కోర్​ లేకున్నా ఇన్​స్టాంట్​ లోన్​ - ఎలా వస్తుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.