Social Worker Satish Chopra : ప్రస్తుత సమాజంలో మనం హాయిగా బతికితే చాలని అనుకునే వారు అనేక మంది ఉంటారు. కానీ, ఈ జీవితం ఇతరులకు సేవ చేయడానికే అని ఆలోచించి, దానిని ఆచరణలో పెట్టేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాకు చెందిన సతీశ్ చోప్రా(47) ఒకరు. సాటి మనిషికి సాయం చేయడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. పెళ్లి సైతం చేసుకోకుండా సమాజ సేవ చేస్తున్నారు సతీశ్. అంబులెన్స్ సాయంతో పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా పేద, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు.
సొంత అంబులెన్స్‌తో
ఎవరికి ఏ సహాయం కావాలన్నా 24 గంటలూ సిద్ధంగా ఉంటారు సతీశ్ చోప్రా. ఎవరికైనా వైద్యం అవరసమని తెలిస్తే స్వయంగా సతీశ్ వెళ్లి ఆస్పత్రికి తీసుకెళతాారు. అందుకోసం స్వయంగా ఓ అంబులెన్స్ కూడా తీసుకున్నారు. స్వంత అంబులెన్స్ ఉంటే ఎవరికైనా వైద్య సాయం అవసరం వస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లవచ్చు కదా అంటారు సతీష్. అలాగే ఎవరి దగ్గరైనా అంత్యక్రియలకు డబ్బు లేకపోతే సతీష్ చోప్రా స్వయంగా వెళ్లి ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేసేవారు. ఏదైనా పెళ్లి వేడుకలో భోజనం మిగిలి ఉంటే సతీష్ అక్కడికి చేరుకుని ఆ ఆహారాన్ని తీసుకెళ్లి పేదలకు పంచుతారు. మురికివాడల్లో నివసించే పిల్లలకు పుస్తకాలు, చెప్పులు, బట్టలు ఇలా ఏదో ఒకటి పంపిణీ చేస్తూనే ఉన్నారు సతీశ్ చోప్రా.
'సేవ చేయడం వారికి నచ్చలేదు'
చిన్నప్పటి నుంచే సామాజిక సేవ అంటే ఇష్టమని సతీశ్ చోప్రా అంటున్నారు. 'నా పనితో పాటు ప్రజలకు సహాయం చేసేవాడిని. ముఖ్యంగా వైద్యం అవసరమైన వారికి సాయం అందించేవాడిని. అప్పట్లో ఓ మొబైల్ షాప్ ఉండేది. అది చూసుకుంటూ మరోవైపు సమాజానికి సేవ కూడా చేసేవాడిని. కానీ 2015లో ఇది నా జీవితం కాదు అనిపించింది. మొబైల్ షాప్ మూసేసి పూర్తిగా సామాజిక సేవ చేయడం మొదలుపెట్టాను. మొదట్లో ఆర్థిక ఇబ్బందులు రాకూడదని స్నేహితులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా నా సేవాభావం కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారంతా నేను కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. కానీ నాకు సామాజిక సేవపైనే మక్కువ. అందుకే నేను నా కుటుంబం మాట వినలేదు. నేను చేసే పనితో చాలా సంతోషంగా ఉన్నా' అని సతీశ్ చెప్పారు.
'నన్ను పిచ్చోడు అన్నారు'
'గతంలో ఎక్కడైనా వివాహం వంటి వేడుకల్లో మిగిలిపోయిన భోజనం ఉందని తెలిస్తే నేనే అక్కడికి వెళ్లి తీసుకుని పేదలకు పంచేేవాడిని. కానీ, ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి చెబుతున్నారు. ఒకప్పుడు నేను సేవ చేస్తున్నప్పుడు పిచ్చోడు అనేవారు. వాళ్లే ఇప్పుడు ఇతరులకు సేవ చేయడంలో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు' అని సతీశ్ చెబుతున్నారు.
అదుపుతప్పి అలకనంద నదిలో పడ్డ వెహికల్- 12మంది మృతి- అనేక మందికి గాయాలు - Vehicle Fell Into River