'స్వర్ణం తీసుకుంటున్నప్పుడు గర్వంగా ఫీలయ్యా' - sindhu expression after reached to hometown
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు హైదరాబాద్లో అడుగుపెట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె... గొప్ప విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. " 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల సాకారమైంది. ఎంతో నిరీక్షణ అనంతరం బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉంది. గతంలో సెమీస్లో ఓడిపోయినప్పుడు బాధ పడ్డాను. ప్రతిసారి ఒకే రకమైన గేమ్ ప్లాన్ పనిచేయదు. ఓడిపోయిన ప్రతిసారి సమీక్ష చేసుకుని కష్టపడాలి. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్ల్లాగానే ఫైనల్ ఆడా. ఆ సమయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఫైనల్లో లాంగ్ ర్యాలీలకు సిద్ధమయ్యా. స్వర్ణ పతకం తీసుకుంటున్నప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యా. నేను స్వర్ణం సాధించాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అందరికీ ధన్యవాదాలు" -- పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
Last Updated : Sep 28, 2019, 12:50 PM IST