Malakpet Viral Video : మీరూ ఆ రూట్‌లోనే వెళ్తున్నారా..? అయితే బీకేర్‌ఫుల్..! - Drainage Water Mixing With Oil at malakpet
🎬 Watch Now: Feature Video
Vehicles Skidding Due To Drainage Water Mixing With Oil at malakpet : హైదరాబాద్ మలక్‌పేట రహదారిపై వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ దారి గుండా వెళ్లేవారిలో చాలామంది ఈరోజు బైక్‌పై నుంచి జారి పడ్డారు. అక్కడేమీ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ కాలేదు.. కానీ డ్రైనేజీ వాటర్ పొంగిపొర్లుతోంది. ఆ డ్రైనేజీ వాటర్‌లో ఆయిల్ కలిసుండటమే వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఆ మార్గం గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు ఆయిల్ ప్రభావంతో అదుపు తప్పుతున్నాయి. మలక్‌పేట కూడలి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద చంచల్‌గూడ నుంచి చాదర్‌ఘాట్ వైపునకు వచ్చే ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుంది. ఆయిల్ వల్ల రెండు గంటల వ్యవధిలోనే సుమారు 50 నుంచి 100 మంది రహదారిపై జారిపడి గాయాల పాలయ్యారని స్థానికులు ఆరోపించారు. ఘటన జరిగి 2 గంటలుగా జరుగుతోన్న జీహెచ్‌ఎంసీ, జల మండలి అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టి ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డును మూసివేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.