తెలంగాణ

telangana

ETV Bharat / videos

అయోధ్య రామాలయం పూర్తి - నిర్మాణం ప్రత్యేకతలేంటో మీకు తెలుసా? - Ayodhya Ceremony

🎬 Watch Now: Feature Video

Prathidhwani on Ayodhya Mandir

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 10:41 PM IST

Prathidhwani on Ayodhya Mandir:నాలుగున్నర శతాబ్దాల కల నెరవేరుతున్న తరుణం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. అందుకు జనవరి 16 నుంచే వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మరి ఈ సందర్భం ప్రత్యేకత ఏమిటి? మందిర్ వహీ బనాయేంగే నినాదం నుంచి అయోధ్య పిలుస్తోంది అన్న ఆహ్వానం వరకు అసలేం జరిగింది?.  

Prathidhwani on Ayodhya Temple: శ్రీరామ జన్మభూ‌మి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 22నే విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎంచుకోవడానికి కారణాలేంటి? ప్రస్తుతం నిర్మిస్తున్న అయోధ్య రామాలయం జీవిత కాలం 1000 ఏళ్లకు పైనే అంటున్నారు. ఇవే గాక ప్రస్తుత నిర్మాణం ప్రత్యేకతలేంటి? శ్రీరామభక్తులకు ఇకపై అయోధ్య ఎలా గుర్తుండిపోనుంది? అయోధ్య  రామ మందిర ప్రారంభోత్సవ ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details