సినిమా రేంజ్లో ప్రయాణికుడ్ని కాపాడిన రైల్వే పోలీస్.. వీడియో వైరల్
రైల్లోంచి పడిపోతున్న ఓ ప్రయాణికుడ్ని రైల్వే పోలీసు చాకచక్యంగా కాపాడాడు. తన సామాన్లు తీసుకోవడానికి ప్రయాణికుడు ప్లాట్‌ఫాంపై దిగాడు. అంతలోనే ట్రైన్ కదిలింది. పరిగెడుతూ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు ప్రయాణికుడు. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందపడబోయాడు. ఇది గమనించిన పోలీసు.. వెంటనే అతడిని రైల్లోకి నెట్టాడు. రెండు సెకన్లు ఆలస్యమైతే ప్రయాణికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. పెను ప్రమాదం తప్పి ప్రయాణికుడు సురక్షితంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఝాన్సీలోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్లో సోమవారం రాత్రి జరిగింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. వీడియో వైరల్ అయింది. ఇంతటి సాహసం చేసిన పోలీసును అందరూ ప్రశంసిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST