గ్రామస్థులపై కోపంతో బైక్ను గాల్లోకి విసిరేసిన ఏనుగు
ఝార్ఖండ్ రాంచీలో ఏనుగు హల్చల్ చేసింది. తమర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్బహత్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు గ్రామస్థులను హడలెత్తించింది. అడవిలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగును గ్రామస్థులు వెళ్లగొట్టె ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏనుగు వారిపైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడే ఉన్న బైక్ను గాల్లోకి విసిరేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST