తెలంగాణ

telangana

Ayodhya Srirama Padukalu

ETV Bharat / videos

Ayodhya Srirama Padukalu : అయోధ్య రాముడికి హైదరాబాద్‌ భక్తుడి అపురూప కానుక.. 9కిలోల బంగారు, వెండి పాదుకల బహుకరణ

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 5:05 PM IST

Ayodhya Srirama Padukalu : అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోన్న వేళ.. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాసులు శాస్త్రి.. రాముడి పట్ల తన భక్తిని చాటుకున్నారు. ఆలయ నిర్మాణానికి వెండి ఇటుకలు ఇచ్చిన శ్రీనివాసులు.. ఇప్పుడు రాములవారికి బంగారు పూత పూసిన వెండి పాదుకలను కానుకగా సమర్పించబోతున్నారు. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా పౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా..  8 కిలోల వెండి, కిలో బంగారంతో ప్రత్యేకంగా శ్రీరాముడికి పాదుకలను తయారు చేయించారు.  

Ayodhya Bhagyanagar Sitarama Seva Foundation : మొత్తం 91 లక్షల రూపాయల వ్యయంతో.. 9 కిలోల బరువున్న పాదుకలను రాములవారికి అందించబోతున్నారు. రెండేళ్ల కింద నల్గొండ జిల్లా చెండూరులో శ్రీనివాసులు ఈ పాదుకలను తయారు చేయించారు. దేశ విదేశాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మఠాల్లో పర్యటించి.. ఈ పాదకలకు పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు దర్శించుకునేలా చూశారు. రామేశ్వరం, శృంగేరి, కంచి, తిరుమల, శ్రీరంగం, సింహాచలం, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో పర్యటించి పాదుకలకు పూజలు నిర్వహించారు. ఈ నెల అక్టోబర్‌ 28న 200 మందితో కలిసి పాదయాత్ర ద్వారా అయోధ్యకు చేరుకుని.. జనవరి 22న యోగి ఆదిత్యానాధ్‌ చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందించనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details