Viral: ధూమ్ సినిమాను తలపించేలా చోరీ - మధ్యప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఎవరైనా ఇళ్లలో దొంగతనం చేస్తారు. మరీ తెగిస్తే వాహనాలు ఆపినప్పుడు అందులో వస్తువులు మాయం చేస్తారు. కానీ వాహనం వేగంగా కదులుతుండగానే.. చోరీ అంటే..అబ్బో దొంగతనాలు చేయటంలో ముదుర్లనే చెప్పాలి. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని షాజపుర్ జిల్లాలో జరిగింది. బెర్చా పోలీసు స్టేషన్ పరిధిలో వస్తువులతో వేగంగా వెళ్తున్న వాహనం పైకి ఓ వ్యక్తి బైక్ సహాయంతో దొంగతనం చేయడానికి ఎక్కుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోగా.. స్థానిక పోలీసులు స్వతహాగానే దర్యాప్తు చేపట్టారు..