తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'రజస్వలైతే పెళ్లికి సిద్ధమనేగా.. 18ఏళ్లు వచ్చేదాకా ఎందుకు ఆగాలి?'

Right Age For Sex: రజస్వల అయిన నాటి నుంచి శారీరకంగా, మానసికంగా ఆడపిల్లల్లో అనూహ్య మార్పులు వస్తాయి. క్రమంగా సెక్స్​ గురించిన ఆలోచనలు మొదలవుతాయి. అయితే రజస్వల అవడం అంటే పెళ్లికి సిద్ధమనే అర్థమా? 18 ఏళ్లు వచ్చాకే రతిలో పాల్గొనాలా?

sex during puberty
age for sex

By

Published : May 5, 2022, 7:25 AM IST

Right Age For Sex: రజస్వల అయిన తర్వాత రతి గురించి ఆడపిల్లల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుంది. అయినా 18 ఏళ్లు వచ్చిన తర్వాతే పెళ్లి చేయడం, రతిలో పాల్గొనడం శ్రేయస్కరం అని పెద్దలు చెబుతారు. సెక్స్​ గురించిన ఆసక్తి, కోరికలు మొదలైనంత మాత్రాన 13-14 ఏళ్లకే ఆ పని చేయడం మంచిది కాదని నిపుణులు కూడా అంటున్నారు. ఎందుకంటే..

"పెళ్లి చేసుకోవడానికి కచ్చితంగా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాలి. 13 సంవత్సరాలకు పెళ్లి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 13-16 సంవత్సరాల వయసులో ఆడపిల్ల ఎదుగుతుంది. ఎముకలు ఎదగాలి, కండ పుష్టి రావాలి. శారీరకంగా ఎదగాలి. గర్భాశయం సహా రీప్రొడ్యూస్ ఆర్గాన్స్​ ఎదగాలి. అయితే 13 సంవత్సరాలకే హార్మోన్లు విడుదల కావడం వల్ల కోరికలు కలుగుతాయి. కానీ.. రతిలో పాల్గొనాలని అనుకోవడం సరికాదు. దానికి శారీరక వృద్ధితో పాటు మానసిక పరిపక్వత కావాలి. అందుకే వ్యక్తి అన్ని విధాలుగా ఎదిగిన తర్వాత.. 18 ఏళ్లు నిండాకే రతిలో పాల్గొనాలి. కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవడం సరికాదు." అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:నిద్రిస్తున్న మహిళతో సెక్స్​ చేయడం మంచిదేనా?

ABOUT THE AUTHOR

...view details