తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వెయిట్ లాస్​ కోసం 'లిక్విడ్ డైట్'.. ఆరోగ్యానికి ప్రమాదకరమా?

Liquid Diet: ఇటీవల కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం లిక్విడ్​ డైట్​ను పాటిస్తున్నారు. తక్షణ శక్తిని అందించే ఈ లిక్విడ్​ డైట్​ వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి? మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏమైనా ప్రమాదకరమా? వీటన్నింటిపై నిపుణులు ఏమంటున్నారంటే?

వెయిట్ లాస్​ కోసం 'లిక్విడ్ డైట్'.. ఆరోగ్యానికి ప్రమాదకరమా?
వెయిట్ లాస్​ కోసం 'లిక్విడ్ డైట్'.. ఆరోగ్యానికి ప్రమాదకరమా?

By

Published : Jun 27, 2022, 5:00 PM IST

వెయిట్ లాస్​ కోసం 'లిక్విడ్ డైట్'.. ఆరోగ్యానికి ప్రమాదకరమా?

Liquid Diet: బరువు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా మారింది. బరువు అదుపులో ఉండేందుకు గంటల తరబడి జిమ్​లో వర్కౌట్​ చేసినా.. డైట్ కంట్రోల్ చేసినా.. కొందరిలో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అందుకు ప్రస్తుత రోజుల్లో చాలా మంది లిక్విడ్ డైట్‌ను పాటిస్తున్నారు. కొందరు బరువు తగ్గడం కోసం కొన్ని నెలలపాటు చాలా సీరియస్​గా​ చేస్తున్నారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం సమాధానమిచ్చారంటే?

"సాధారణంగా చాలా మంది లిక్విడ్​ డైట్​ తీసుకుంటే బరువు తగ్గిపోతాము అనుకుంటారు. అలా చేస్తే తగ్గే అవకాశముంది. కానీ ఎక్కువ రోజులు లిక్విడ్​ డైట్​ పాటించకూడదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వచ్చి తీరతాయి. లిక్విట్​ డైట్​ పాటించేవారు పండ్లను రసాల రూపంలో తీసుకుంటారు. అయితే జ్యూస్​ చేసేటప్పుడు అందులో ఉండే చాలా పోషకాలు పోతాయి. అందుకే వాటి వల్ల పెద్దగా లాభం ఉండదు. కొబ్బరి నీరు, బాదం మిల్క్​, సోయా మిల్క్​ వంటివి అధిక మొత్తంలో తీసుకోవచ్చు. అవి కూడా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తాగాలి. రోగాల బారిన పడిన వారు.. వైద్యుల సలహా మేరకు మాత్రమే లిక్విడ్​ డైట్​ను​ పాటించాలి."

-- డా. శ్రావ్య, డైటీషియన్​

ఎలాంటి సమయంలో లిక్విడ్స్​ను ఎక్కువగా తీసుకోవాలి?.. "దంత సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, నోటి లోపల పుండ్లు ఏర్పడినప్పుడు, ఆపరేషన్లు జరిగే మందు, తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవాలి. వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి లిక్విడ్స్​ను ఎక్కవగా తీసుకోవాలి. పేగు సంబంధింత వ్యాధులు, మలబద్దకం బారిన పడినప్పుడు, జీర్ణాశయానికి సంబంధించి ఏవైనా పరీక్షలు చేయించుకునేటప్పుడు ద్రవ పదార్థాలను అధిక మొత్తంలో తీసుకోవాలి" అని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:ఈ సింపుల్​ టిప్స్​తో ముఖంపై మొటిమలు మాయం!

నైట్​ షిఫ్ట్ చేసే మగవారికి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details