తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం నిర్లక్ష్య పరిపాలన వల్లే నిరుద్యోగం 4రెట్లు పెరిగింది: వైఎస్​ షర్మిల

YS Sharmila Padayatra: సీఎం కేసీఆర్ నిర్లక్ష్య పరిపాలన కారణంగానే నిరుద్యోగం నాలుగురెట్లు పెరిగిందని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వలిగొండ మండలంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం గోల్నెపల్లి గ్రామంలో నిర్వహించిన మాటా ముచ్చట కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు.

YS Sharmila Padayatra
వైఎస్​ షర్మిల

By

Published : Mar 14, 2022, 10:25 PM IST

YS Sharmila Padayatra: రక్తం ధార పోసి, అప్పులు చేసి చదివించిన పేద పిల్లలు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుద్దబావి గూడెంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే...

Sharmila Padayatra: ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా వైఎస్ షర్మిలకు ప్రజలు స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతి పట్టారు. గోల్నెపల్లి గ్రామంలో నిర్వహించిన మాటా ముచ్చట కార్యక్రమంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

బూర్లగడ్డలో ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు, యువతీ, యువకులు ఆమెతో కరచాలనం చేయటానికి, సెల్ఫీలు తీసుకోవటానికి పోటీ పడ్డారు. వలిగొండ మండలం నెమిలికాల్వ గ్రామంలో ఈరోజు రాత్రి ఆమె బస చేయనున్నారు. రేపు(మంగళవారం) ఉదయం గోల్నెపల్లి స్టేజి వద్ద నిరుద్యోగ దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:KTR On Students: ఆరు నెలలపాటు సినిమాలు కాస్త తక్కువగా చూడండి: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details