యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. 19 రోజులకు.. రూ. 95లక్షల, 24వేల, 587 నగదుతో పాటు.. 185 గ్రాముల బంగారం, 2, 600 గ్రాముల వెండి.. ఆలయ ఖజానాకు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి కాసుల వర్షం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీ లెక్కించారు. 19 రోజులుగా హుండీలో వేసిన నగదు, ఇతర కానుకల రూపంలో రూ. కోటికి పైగా ఆదాయం.. స్వామివారి ఖజానాకు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి కాసుల వర్షం
మరోవైపు గుట్టపై.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు భీష్మ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో స్పష్టత...!