తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 11:42 AM IST

ETV Bharat / state

కరోనా అంతానికి సువర్ణ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం

కరోనా మహమ్మారి పీడ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు మహాయజ్ఞం చేపడుతున్నట్లు అఖండనామ ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వందమందికి పైగా స్వామీజీలు, సాధువులకు ఆహ్వానం పంపించామని ఆయన పేర్కొన్నారు.

కరోనా అంతానికి  సువర్ణ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం
కరోనా అంతానికి సువర్ణ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా పీడ విరగడకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి గార్డెన్స్​లో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం చేపడుతున్నట్లు అఖండనామ ఆశ్రమ పీఠాధిపతి ప్రసన్న కృష్ణదాస్ ప్రభూజీ తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్​ 17 నుంచి మే 14 వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యాదాద్రి గుట్టలో భక్తులతో కలసి యజ్ఞ కరపత్రాలను ప్రభూజీ ఆవిష్కరించారు. ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ యజ్ఞంలో పాల్గొనాల్సిందిగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందమంది స్వామీజీలు, సాధువులకు ఆహ్వానం పంపించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రచ్చ యాదగిరి, కోకల రవీందర్, అరె స్వామి, శ్రీనివాస్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:భాగ్యనగర దారుల్లో చిమ్మ చీకట్లు.. వెలగని దీపాలు

ABOUT THE AUTHOR

...view details