యాదాద్రి భువనగిరి జిల్లా వర్కట్పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను వలిగొండ పోలీసులు దత్తత తీసుకుంటున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొనే చదివించాలని బడిబాట కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు పోలీసుల సహకారంతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ప్రతిభావంతులని, వారి బోధన ద్వారా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని ఏసీపీ సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు.
స్కూల్‌ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు - వలిగొండ పోలీసులు
యాదాద్రి జిల్లా వర్కట్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు వలిగొండ పోలీసులు ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య విజ్ఞప్తి చేశారు.

స్కూల్‌ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు
స్కూల్‌ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు
Last Updated : Jun 18, 2019, 7:10 PM IST