పోలీస్ బందోబస్తు నడుమ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వలయ రహదారి పనులు జరుగుతున్నాయి. పాత గోశాల స్థలంలో రహదారి నిర్మాణం కోసం మట్టిని పోసి చదును చేశారు. ఇప్పటికే ఆ ప్రాంగణంలో తాటి చెట్లు, కంపచెట్లు, ప్రహరీ శిథిలాలను తొలగించారు. రోడ్లు భవనాల శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.
బాధితులకు సైదాపురం రెవెన్యూ పరిధిలో వంద గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం వల్ల నిర్మాణాల వద్ద ఎలాంటి అడ్డుంకులు ఎదురుకాలేదు.
రోడ్డు విస్తరణ పనులను యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు జడ్పీటీసీ కుడుదుల నగేష్ పరిశీలించారు. గోశాల వద్ద ఉన్న జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రహరీ గోడ కూల్చివేత వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వెంటనే అక్కడ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరారు.
రోడ్డు నిర్మాణం చేపట్టాక వాహనాల రద్దీ పెరుగుతుందని.. ఫలితంగా పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు రోడ్డు దాటేందుకు అండర్ పాస్ వంతెన నిర్మించాలని కోరారు.
ఇవీచూడండి:యాదాద్రిలో రోడ్డు విస్తరణకు కొలతలు