యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే యువతి మృతిచెందగా, యువకుడు గాయాలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలో చదువుతున్న అరుణ తన స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి యాదాద్రి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. అరుణ శరీరంపై నుంచి కారు దూసుకెళ్లటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అరుణ నల్లకుంట, శ్రీకాంత్ ముషీరాబాద్ వాస్తవ్యులుగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లిన అరుణ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ద్విచక్ర వాహనంపై యాదాద్రి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
ఇవీ చూడండి : ఏనుగు దాడిలో ఐదుగురు మృతి