తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలపై ఆంక్షలు లేవు : చౌటుప్పల్‌ ఆర్డీఓ - Choutuppal RDO Suraj kumar Vegitable rates

నిత్యావసర వస్తువులపై ఎలాంటి ఆంక్షలు లేవని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ఆర్డీఓ సురాజ్‌ కుమార్‌ తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ వల్ల చౌటుప్పల్‌లో కూరగాయల ధరలు పెరగడం వల్ల ఆయన ప్రజలకు స్పష్టతనిచ్చారు.

RDO Suraj Kumar
RDO Suraj Kumar

By

Published : Mar 24, 2020, 10:54 AM IST

నిత్యావసర సరుకులను అధిక ధరకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ఆర్డీఓ సురాజ్‌ కుమార్‌ అన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల చౌటుప్పల్‌లో కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

ఈ తరుణంలో నిత్యావసరాలపై ప్రజలకు ఆర్డీఓ స్పష్టతనిచ్చారు. నిత్యావసర వస్తువులపై ఆంక్షలు లేవని... అవి ప్రతి రోజు లభిస్తాయని పేర్కొన్నారు. వాటి కోసం ఎవ్వరూ కంగారు పడవద్దని సూచించారు. ఒకేసారి ఎక్కువగా వస్తువులు కొనడం ద్వారా వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతారని... అలాగే వెనక వచ్చేవారికి అందకుండా పోయే అవకాశముందని చెప్పారు.

నిత్యావసరాలపై ఆంక్షలు లేవు : చౌటుప్పల్‌ ఆర్డీఓ

ఇవీ చదవండి :లాక్​డౌన్​పై సీఎం సమీక్ష.. పటిష్ట అమలుకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details