యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రిని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు. ప్రసవ గదిని, శస్త్ర చికిత్స చేసే గదిని, నవజాత శిశువుల వార్డుల్లో కలియతిరిగారు. తగినంత మంది వైద్యులు, వైద్య పరీక్ష పరికరాలు, మెడిసిన్ అందుబాటులో లేవని గర్భిణీలు, బాలింతలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందటం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వాసుపత్రిలో సేవలపై సిబ్బందిని నిలదీసిన కోమటిరెడ్డి - చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఆసుపత్రిలో ఉన్న సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలుస్తానని... ఆయనకి చెప్పి సమస్యలు పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులు బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇవీ చూడండి: ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సీ
Last Updated : Dec 9, 2019, 8:57 PM IST