తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Golden chariot: యాదాద్రి దివ్యరథం.. స్వర్ణమయం

Yadadri Golden chariot: యాదాద్రి దివ్యరథానికి మరింత శోభను పెంచేలా ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా దాతల సహాయంతో రథాన్ని బంగారు కవచాలతో బిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈరోజు బంగారు కవచాలకు ఆలయంలో పూజలు నిర్వహించారు.

Gold shields for Yadadri Divyaratha
యాదాద్రి దివ్యరథానికి బంగారు కవచాలు

By

Published : Mar 9, 2022, 6:45 PM IST

Gold shields for the Yadadri chariot: యాదాద్రి ఆలయ దివ్యరథాన్ని స్వర్ణమయం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ఆర్డర్ చేసిన బంగారు కవచాలు చెన్నై నుంచి ఆలయానికి చేరుకున్నాయి. దాతల సహాయంతో వీటిని రూపొందించారు.

చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ నిపుణులు తయారుచేసిన లక్ష్మీ నరసింహ, గరుడ, హనుమ, బంగారు కవచాలకు ఆలయంలో పూజలు నిర్వహించారు. దివ్య విమానం రథంపై కవచాల బిగింపు పనులను రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 12వ తేదీన బాలాలయంలో నిర్వహించే దివ్యవిమాన రథోత్సవ కార్యక్రమంలో.. స్వామివారిని వైభవంగా స్వర్ణ రథంలో ఊరేగిస్తామని ఆలయ ఈఓ గీత పేర్కొన్నారు.

యాదాద్రి దివ్యరథానికి బంగారు కవచాలు

ఇదీ చదవండి:Yadadri brahmotsavalu 2022: గోవర్ధన గిరిధారి రూపంలో నరసింహుని అభయప్రదానం

ABOUT THE AUTHOR

...view details