తమకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. వెంటనే పరిహారం చెల్లించాలంటూ యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బి.ఎన్. తిమ్మాపూర్లోని ప్రాజెక్ట్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
బస్వాపూర్ ప్రాజెక్ట్ వద్ద నిర్వాసితుల ఆందోళన
యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు.. ప్రాజెక్ట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
బస్వాపూర్ నిర్వాసితులు
తమను ఏమాత్రం పట్టించుకోకుండా.. యథావిథిగా పనులు కొనసాగిస్తున్నారంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం.. భువనగిరి తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డిని కలిసి తమకు పునరావాసం కల్పించాల్సిందిగా కోరారు.
ఇదీ చదవండి:శ్రీరాముడి ఆశీర్వాదంతో కరోనాపై పోరాడుదాం : తమిళిసై