తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - బతుకమ్మ సంబురాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి నిత్యం రోగుల ఆర్తనాదాలతో దద్దరిల్లే ఆస్పత్రి నేడు బతుకమ్మ పాటలు, ఆటలతో కళకళలాడింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

నిత్యం రోగులకు చికిత్స చేస్తూ... మందులతో కుస్తీ పడే వైద్యులు నేడు సరదాగా బతుకమ్మ ఆడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ... కోలాటాలతో సందడి చేశారు. చౌటుప్పల్ పీహెచ్​సీ పరిధిలోని ఆశా కార్యకర్తలు పెద్ద బతుకమ్మను పేర్చి తీసుకువచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABOUT THE AUTHOR

...view details